ముంపు గ్రామంలో విషాదం-ఒత్తిడికి లోనై వ్యక్తి మృతి
యాదాద్రి ముచ్చట్లు:
యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బి ఎన్ తిమ్మాపురం విషాదం చోటుచేసుకుంది. బిఎన్ తిమ్మాపురం గ్రామస్తులు 57 రోజులుగా ధర్నాలు, ఆందోళన చేస్తున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా అధికారులు ఇండ్లకు నోటీసులు ఇవ్వడానికి గ్రామానికి వెళ్లారు. అధికారుల రాకతో తీవ్ర ఒత్తిడికి గురైన జూపల్లి నర్సింహ హార్ట్ ఎటాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు. దాంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
Tags: Tragedy in Mumpu village – Man dies under pressure

