Natyam ad

పటాన్ చెరులో విషాదం.. ఉరేసుకుని ముగ్గురి ఆత్మహత్య

సంగారెడ్డి ముచ్చట్లు:


జిల్లాలోని పటాన్ చెరు మండలం భానూరులో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను తల్లి రేఖ (28), కుమార్తె (2), రేఖ మరిది బాసుదేవ్ (27)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. వీరంతా మధ్యప్రదేశ్  చెందిన వలస కూలీలని పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

 

Tags: Tragedy in Patan Cheru.. Three people committed suicide in anger

Post Midle
Post Midle