పెడనలో విషాదం కుటుంబం ఆత్మహత్య

విజయవాడ ముచ్చట్లు:
కృష్ణా జిల్లా పెడనలో చేనేత కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. దంపతులతో పాటు కుమారుడు ఉరేసుకుని తనువులు చాలించారు. మృతులు కాచన పద్మనాభం(52), నాగ లీలావతి(45), రాజా నాగేంద్ర(24). దాంతో పెడనలో విషాధఛాయలు అలముకున్నాయి. కాగా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తాళలేక వారు ఆత్మహత్యకి పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 
Tags: Tragedy in Pedana Family suicide

Leave A Reply

Your email address will not be published.