తాండూరు ట్రైన్ లో విషాదం : TC ఓవర్ యాక్షన్ తో యువకుడి మృతి

Railway ticket collector over action lives a young man.

Railway ticket collector over action lives a young man.

Date:15/09/2018

తాండూరు ముచ్చట్లు:

రైల్వే టికెట్ కలెక్టర్ ఓవర్ యాక్షన్ ఓ యువకుడి ప్రాణంతీసింది. వికారాబాద్ జిల్లాలో జరిగిందీ దారుణం. తాండూరు-నాంపల్లి ప్యాసింజర్ రైల్లో ఇవాళ ఉదయం జరిగిందీ ఘటన. గొల్లగూడ స్టేషన్ దగ్గర టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న యువకుడు టీసీని చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు.

 

యువకుడ్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు టీసీ. దాంతో అదుపుతప్పి ట్రైన్ కింద పడ్డాడు. బాడీ రెండు ముక్కలైంది. మొండెం వేరైంది. ఊహించని ఘటనతో ప్రయాణికుల భగ్గుమన్నారు. టీసీని చితకబాది… రైల్వే పోలీసులకు అప్పగించారు ప్రయాణికులు.

 

యువకుడి మృతితో గొల్లగూడ స్టేషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేశామనీ, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు.

అనంతలో మూడు ట్రాక్టర్లు దగ్ధం

Tags:Tragedy in Tandoor Train

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *