పోలీసు రిక్రూమెంట్ పరుగు పందెంలో విషాదం
వరంగల్ ముచ్చట్లు:
వరంగల్ లో విషాదం నెలకొంది. పోలీసు రిక్రూమెంట్ పరుగు పందెంలో ఒక యువకుడు రాజేందర్ పడిపోయాడు. వెంటనే అధికారులు విషాదం అతడిని ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేందర్ మృతి చెందాడుజ ఈ నెల 17 న 1600 మీ. పరుగులో రాజేందర్ అస్వస్థతకు గురైయాడు. సోమవారం రాత్రి మృతి చెందాడు. కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్ లో కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టు ల నిర్వహించారు. రాజేందర్ కు గుండెపోటు వచ్చినట్లు డాక్టర్లు గుర్తించారు. రాజేందర్ కు నాలుగు రోజులుగా వెంటిలేటర్ పై ఎంజీఎంలో చికిత్స జరిగింది. రాజేందర్ స్వస్థలం ములుగు జిల్లా శివా తండా.
Tags: Tragedy in the race for police recruitment

