వందే భారత్ రైలు లో విషాదం-గుండెపోటుతో వ్యక్తి మృతి
నల్గొండ ముచ్చట్లు:
వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ఓ వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ట్రైన్ ను నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో నిలిపి ఆ వ్యక్తిని మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు.
సికింద్రాబాద్ మీర్పేటకు చెందిన 72 సంవత్సరాల ప్రభాకర్ అనే వ్యక్తి తన మనవరాలు పుట్టు వెంట్రుకల మొక్కు కోసం కుటుంబ సభ్యులతో కలసి తిరుపతికి బయలుదేరారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తుండగా నల్లగొండ దాటిన తర్వాత గుండె నొప్పిగా ఉండటంతో మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో అత్యవసరంగా ట్రైన్ ను నిలిపివేశారు. అప్పటికే ట్రైన్ లో పలువురు ప్రయాణికులు ప్రభాకర్కు సి పి ఆర్ చేసి హుటాహుటిన అంబులెన్స్ లో మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రభాకర్ తుది శ్వాస విడిచారు.

Tags: Tragedy in Vande Bharat train – Man died of heart attack
