Natyam ad

విషాదాంతమైన విద్యార్తుల గల్లంతు ఘటన

విజయవాడ ముచ్చట్లు:
 
ఏపీలోని కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ఏటూరు వద్ద మున్నేరులో విద్యార్థుల గల్లంతు ఘటన విషాదాం తమైంది. మున్నేరులో సోమవారం రోజున ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు.వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చేపట్టారు.ఇసుక కోసం తవ్విన గుంతలో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు గురజాల చరణ్(14), కర్ల బాలయేసు(12), మైలా రాకేశ్(11), జెట్టి అజయ్(12), మాగులూరి సన్నీ(12)గా పోలీసులు గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి మున్నేరు వాగు వైపు వెళ్లిన పిల్లలు రాత్రి అవుతున్నా తిరిగి రాకపోవడం తో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళ నకు గురయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పిల్లల దుస్తులు.. వారు వేసుకొని వెళ్లిన సైకిళ్లు మున్నేరు వాగు ఒడ్డున ఉండటాన్ని గుర్తించారు. ఆ పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్థులంతా మున్నేరు పరిసర ప్రాంతాల్లో పిల్లల కోసం గాలించారు. నిన్న రాత్రి ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు.  మంగళవారం ఉదయం ఐదుగురి విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. బాలురి మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Tragic student abduction incident