పుంగనూరులో 28న హజ్ యాత్రికులకు శిక్షణ
పుంగనూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా నుంచి హజ్‌యాత్రకు ప్రభుత్వం తరపున వెళ్తున్న ముస్లింలకు ఈనెల 28న పట్టణంలోని ఉర్ధూస్కూల్‌లో శిక్షణ ఇస్తున్నట్లు అంజుమన్ కమిటి అధ్యక్షుడు ఎంఎస్.సలీం తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హజ్‌యాత్రకు వెళ్లే వారికి శిక్షణా కార్యక్రమంలో వ్యాక్సినేషన్ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యఅతిధిగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొంటారని ఆయన తెలిపారు. యాత్రకు వెళ్లే ముస్లింలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Tags: Training for pilgrims on 28th at Punganur
