డిప్లొమా పూర్తి చేసిన వారికి ఆటోమోటివ్ రంగంలో శిక్షణ

Date:
19/05/2018
విజయవాడ  ముచ్చట్లు:
అనంతపురం జిల్లాలో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులకు ఆటోమోటివ్ రంగంలో స్వల్పకాలిక సాంకేతిక నైపుణ్య శిక్షణ అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. అందులో భాగంగా అనంతపురం, పెనుగొండలో నిర్వహించే వారం రోజుల స్వల్పకాలిక శిక్షణ కోసం డిప్లొమా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వారం రోజులపాటు నిర్వహించే బేసిక్ టెక్నికల్ కోర్సు(బిటిసి) శిక్షణ ద్వారా ఆటోమోటివ్ రంగంలో అభ్యర్థుల నైపుణ్యాలను పెంచడం ముఖ్య ఉద్దేశ్యమని ఎపిఎస్‌ఎస్‌డిసి అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా పెనుగొండ వద్ద ప్రారంభయ్యే కియా మోటార్స్ ఇండియా(కెఎంఐ) సంస్థతోపాటు ఇతర సహాయక పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాలను ఈ శిక్షణ ద్వారా అభ్యర్థులుపొందుతారు.   అంతేకాకుండా శిక్షణ పొందిన అభ్యర్థులకు పెనుగొండలోని కియా మోటార్స్ ప్లాంట్ లో ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉంటాయి.ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకునేవారు అనంతపురం జిల్లా వాసులై ఉండడంతోపాటు 19ఏళ్ల నుంచి 25ఏళ్ల వయసు వారు ఏ విభాగంలోనైనా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడామే 20వ తేదీ నుంచి జూన్ 3వ తేదీవరకు వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల అర్హతలు ఇతర అంశాలను పరిశీలించి శిక్షణకు సంబంధించిన పరీక్ష తేదీని అభ్యర్థులకు మెయిల్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తామని ఎపిఎస్‌ఎస్‌డిసి అధికారులు తెలిపారు.శిక్షణకు సంబంధించిన పరీక్షను అనంతపురం జిల్లాలోని ఎంప్లాయిబిలిటీ స్కిల్ సెంటర్స్ లో నిర్వహిస్తారు. పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారిని వారం రోజులపాటు నిర్వహించే శిక్షణకు ఎంపిక చేస్తారు. అవసరాన్ని బట్టి శిక్షణా కాలంలో అభ్యర్థులకు వసతి సౌకర్యం కల్పించే అవకాశం ఉంటుంది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులను కియా మోటార్స్ కంపెనీలో ఎంట్రీ లెవల్ షాప్ ఫ్లోర్ వర్క్ మెన్ కేటగిరీల ఉద్యోగాల కోసం పంపుతారు. కియా మోటార్స్ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి వారికి అవసరమైన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు.  వారం రోజులపాటు ఇచ్చిన బేసిక్ టెక్నికల్ కోర్సు పూర్తి చేసినంతమాత్రాన కియా మోటార్స్ లో ఉద్యోగం గ్యారంటీ అన్నది మాత్రం ఉండదని ఎపిఎస్‌ఎస్‌డిసి అధికారులు తెలిపారు. అయితే కియా మోటార్స్ తోపాటు త్వరలో ప్రారంభమయ్యే దాని అనుబంధ పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని వారు తెలిపారు.
 Tags:Training in automotive field for diploma completed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *