ఆర్ ఓ, ఏఆర్ఓ లకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ 

Date:15/04/2019
జగిత్యాల ముచ్చట్లు :
మండల ప్రజా పరిషత్ మరియు జిల్లా ప్రజా పరిషత్ 2019 ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవి గార్డెన్ లో ఆర్.ఓ , ఏ ఆర్ ఓ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు అదనపు ఎన్నికల అధికారి బి .రాజేశం హాజరై ఆనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ఆర్ .ఓ. మండల స్థాయి అధికారిని నియమించడం జరిగిందని ఏ .ఆర్. ఓ స్కూల్ అసిస్టెంట్ హోదాలో ఉన్నవారికి నియమింపబడిందని తెలిపారు. జడ్పిటిసి ఎన్నికల నిర్వహణకు ఆర్ ఓ జిల్లాస్థాయి అధికారిని నియమింపబడిందని  వీరే మండల ప్రత్యేక అధికారులని తెలిపారు .రిటర్నింగ్ అధికారి నామినేషన్ స్వీకరించుట నోటీస్ బోర్డ్ పై స్వీకరించిన నామినేషన్ అభ్యర్థుల జాబితా ప్రకటించుట నామినేషన్ తిరస్కరించినప్పుడు కారణాలు తగిన ఆధారాలు తెలపాలని కోరారు. నామినేషన్ పత్రాల జాబితాను ప్రచురించడం ఉప సంహరించడం నోటీసుల స్వీకరణ పక్షపాతం వహించరాదని నామినేషన్ పత్రాలను పరిశీలన నాలుగు రకాలుగా గుర్తించాలని జాతీయస్థాయి గుర్తింపు పొందిన పార్టీలు, ఇతర పార్టీల గుర్తింపు పొందిన స్వతంత్ర అభ్యర్థులు ఉంటారని తెలిపారు.
ఎన్నికల పోటీలలో నిలబడే అభ్యర్థుల జాబితా తయారు చేయు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నామినేషన్ పత్రాలను ఏవిధంగా పేరు రాస్తారో కొంతమంది ఇంటి పేరు ముందు రాసి పేరు  రాస్తారు, మరికొంతమంది పేరు రాసి ఇ ఇంటిపేరు తర్వాత రాస్తారు వారు రాసినది ప్రకారం పేరు మొదటి అక్షరం ఆధారంగా పేర్ల క్రమమును నిర్ణయించాలి అని తెలుగు అక్షర క్రమంలో తీసుకోవాలని తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎన్నికలలో పోటీ చెయు వారికి గుర్తులు కేటాయించడంలో జాతీయ స్థాయి మరియు రాష్ట్రస్థాయి కాకుండా స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపులలో పోటీ పడి నప్పుడు రిటర్నింగ్ అధికారి తనకు ఇష్టం ఉన్న గుర్తులను కేటాయించవచ్చనన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రిటర్నింగ్ అధికారి ఎన్నికల సంఘం ఆదేశాలు పాటించి డబ్బు మధ్యము అనుమతులు లేకుండా సభలు సమావేశాలు నిర్వహించినప్పుడు చర్యలు తీసుకోవాలని కోరారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించుటకు ఎన్నికల సిబ్బంది సరిగా పని చేయాలి ఈరోజు జరుగుతున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎంతో మంచిగా నిర్వహించామని అదే అనుభవంతో దృష్టిలో ఉంచుకొని లోక్ సభ ఎన్నికలు దేశంలోనే మొట్టమొదటిసారిగా అతి తక్కువ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక ఛాలెంజ్ గా నిర్వహించడం జరిగిందని జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని సజావుగా నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారి మరియు ఉప ఎన్నికల అధికారి నరేందర్ ఎంపీటీసీ ,జడ్పీటీసీ లైజనింగ్ అధికారి మదన్ మోహన్ జిల్లా పంచాయతీ అధికారి మరియు అదనపు ఎన్నికల అధికారి శ్రీలత రెడ్డి ,ఆర్ ఓ లు ఎ ఆర్ ఓ లు తదితరులు పాల్గొన్నారు.
Tags:Training on election management for AROs and AROs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *