Natyam ad

మూడు నూతన చట్టాలపై శిక్షణ కార్యక్రమం-జిల్లా ఎస్పీ  మలిక గర్గ్ ఐపీఎస్

తిరుపతి ముచ్చట్లు:

ఇప్పటికే 9 జిల్లాలకు చెందిన 80 మంది 2 బ్యాచుల అధికారులకు వారం రోజుల పాటు శిక్షణ కార్యక్రమం పూర్తి అయ్యింది.ఎన్నికల ప్రక్రియ లో పోలీసు అధికారులు సిబ్బంది నిమగ్నం అవడంతో శిక్షణ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా నిర్వహణ.మొదటి విడతగా 26-02-2024 నుండి 02-03-2024 వరకు ఆరు రోజులపాటు “జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్లో వర్చువల్ తరగతుల” ద్వారా బోధించిన కళ్యాణి డాం అధికారులు.ఆరు జిల్లాల నుండి సుమారు 2,900 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది తరగతులకు హాజరై శిక్షణ పొందారు.జిల్లా ఎస్పీ  మలిక గర్గ్ ఐపీఎస్.,  ఆదేశాల మేరకు కళ్యాణి డాం పిటిసి ప్రిన్సిపల్ రాధాకృష్ణ.రాష్ట్ర  డిజిపి  కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్.,  ఆదేశాల మేరకు రాష్ట్ర ట్రైనింగ్ ఐజి శ్రీ వెంకటరామిరెడ్డి ఐపీఎస్., పర్యవేక్షణలో తిరుపతి జిల్లా ఎస్పీ  మలిక గర్గ్ ఐపీఎస్.,  సహకారంతో కళ్యాణి డాం పిటిసి ప్రిన్సిపల్ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం వారు నూతనంగా తీసుకువచ్చిన మూడు కొత్త చట్టాలు భారతీయ న్యాయ సంహిత, నాగరిక సురక్ష సంహిత, సాక్ష్య అధినీయం లపై ఇప్పటికే 9 జిల్లాలకు చెందిన 80 మంది రెండు బ్యాచ్ ల పోలీస్ అధికారులకు నేరుగా శిక్షణ ఇవ్వడం జరిగింది.

 

 

Post Midle

సార్వత్రిక ఎన్నికలు-2024 ప్రక్రియ బాధ్యతలలో పోలీసు అధికారులు, సిబ్బంది తలమునకలు అవుతుండడంతో శిక్షణ కార్యక్రమాన్ని జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్ లో నిర్వహించాలని రాష్ట్ర  డిజిపి  కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్., గారు ఆదేశాలు ఇచ్చారు.మొదటి విడతగా 26-06-2024 నుండి 02-03-2024 వరకు ఆరు రోజులపాటు ప్రతిరోజు రెండు గంటలసేపు “జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్లో వర్చువల్ తరగతులు” నిర్వహించి కళ్యాణి డాం పోలీసు అధికారులు బోధించారు. ఈ శిక్షణ తరగతులకు తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 2,900 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది తమ పోలీస్ స్టేషన్,ల అధికార కార్యాలయాల నుండి హాజరై నూతన భారత శిక్షాస్మృతి చట్టాలు అయినా భారతీయ న్యాయ సంహిత, నాగరిక సురక్ష సంహిత, సాక్ష్య అధినీయం లపై శిక్షణ పొంది తెలుసుకున్నారు.

 

 

ఈ ట్రైనింగ్ కార్యక్రమానికి హాజరైన పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారని, అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా అభినందించారని, ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా ముగించడంలో తోడ్పడిన డిఎస్పీలు రామకృష్ణ, శ్రీనివాసులు, మురళి నాయక్, రాజారావు మరియు పిటిసి కళ్యాణి డాం అధ్యాపక అధికారులకు పేరుపేరునా పిటిసి కళ్యాణడం ప్రిన్సిపల్ ఎం.కే.రాధాకృష్ణ  ధన్యవాదాలు తెలియజేశారు.

Tags:Training program on three new laws-District SP Malika Garg IPS

Post Midle