Natyam ad

ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి ప్రతి జిల్లాలో శిక్షణా కార్యక్రమాలు

– దేశంలో ప్రకృతి వ్యవసాయ విభాగం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే

– నోడల్ గోశాలల నిర్వాహకులు, గో ఆధారిత వ్యవసాయ రైతుల శిక్షణా కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

 

తిరుపతి ముచ్చట్లు:

Post Midle

రసాయన ఎరువులు క్రిమిసంహారక మందుల నుంచి నేల తల్లిని కాపాడటమే ధ్యేయంగా, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున రైతు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.
శ్వేతా భవనం లో గురువారం టీటీడీ గోసంరక్షణ శాల ఆధ్వర్యంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని ప్రకృతి వ్యవసాయ రైతులకు, రాష్ట్రంలోని నోడల్ గోశాలల నిర్వాకులకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం చేపట్టింది. కార్యక్రమానికి టీటీడీ ఛైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ విభాగాన్ని ఏర్పాటు చేసి రైతులను ఈ దిశగా అడుగులు వేయిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా టీటీడీ కూడా గో సంరక్షణ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన తెలిపారు.ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులకు టీటీడీ గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తోందన్నారు.

 

 

నోడల్ గో శాలలు తమ పరిధిలో ఉన్న గోశాలలను సమన్వయం చేసుకుంటూ, వాటి నిర్వాహకులకు ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన కల్పించాలని ఆయన కోరారు.
ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు టీటీడీ ఉచితంగా ఆవులు, ఎద్దులు ఇస్తోందన్నారు.
రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో రైతులకు ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి, ఆ ఉత్పత్తులను టీటీడీ ఎలా సేకరిస్తుందనే అంశాలపై నిపుణులతో అవగాహన కల్పిస్తామన్నారు. శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరూ తమ పరిధిలోని మిగిలిన రైతులకు ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కల్పించి వారిని ప్రోత్సహించాలని చైర్మన్ పిలుపునిచ్చారు. గో పోషణకు ఇబ్బంది ఉన్న గోశాలల ను ఆదుకునే ఆలోచన చేస్తామన్నారు.గో ఆధారిత వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులతో తిరుమల శ్రీవారికి గత ఏడాదిన్నరగా ప్రసాదాలు తయారు చేస్తున్నామని, ఇది శాశ్వతంగా కొనసాగేందుకు రైతులను గో ఆధారిత వ్యవసాయం వైపు నడిపించే లా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. రైతులు గో ఆధారిత వ్యవసాయం పై దృష్టిపెట్టి నేలతల్లిని, తద్వారా మానవాళిని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.

 

 

ఇస్కాన్ సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీ రేవతి రమణ దాస్ మాట్లాడుతూ, టీటీడీ గోవు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికి తెలిపేలా చేపట్టిన కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఆవు పాలు అల్జీమర్స్ రాకుండా చేయడానికి మంచి మందులా పని చేస్తాయన్నారు. గో సంరక్షణ, గో ఆధారిత వ్యవసాయం అంశాల్లో ఇస్కాన్ టీటీడీ తో కలసి పనిచేస్తోందన్నారు.
గోమాత వైశిష్ట్యం, గో ఆధారిత వ్యవసాయం వలన సమాజానికి కలిగే మేలును ఆయన వివరించారు.టీటీడీ గో సంరక్షణ కమిటీ సభ్యులు  రామ్ సునీల్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల గురించి అప్పట్లో దివంగతముఖ్యమంత్రి వైయస్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఎంతో ఆలోచించి ఉచిత విద్యుత్, వ్యవసాయ రుణాల మాఫీ లాంటి కార్యక్రమాలు అమలు చేశారని చెప్పారు. ఆయన కుమారుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా లాంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రకృతిని కాపాడటానికి రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహిస్తున్నారన్నారు. స్వతహాగా రైతు బిడ్డ ,గో ప్రియుడు అయిన టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. టీటీడీ ఈవో  ఎ వి ధర్మారెడ్డి, జెఈవో లు  సదా భార్గవి,  వీర బ్రహ్మం, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి , శ్వేతా డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

ఆవుల పంపిణీ

గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న తిరుపతి జిల్లా డివి సత్రం కు చెందిన రైతులకు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి 8 గోవులను ఉచితంగా అందించారు . గోవులను తీసుకుని వెళుతున్న వాహనాన్ని ఆయన ఈవో  ధర్మారెడ్డి ,జె ఈవో లు  సదా భార్గవి  వీర బ్రహ్మం తో కలసి జెండా ఊపి సాగనంపారు .

 

Tags: Training programs in every district for promotion of nature agriculture

Post Midle