Natyam ad

యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు శిక్షణ- రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

నిరుద్యోగ యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలను రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహిస్తోందని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌, జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, టీటీడీ బోర్డు మెంబరు పోకల అశోక్‌కుమార్‌తో కలసి స్థానిక ఐటిఐలో స్కిల్‌హబ్‌ను ప్రారంభించారు.ఐటిలో వివిధ ట్రేడ్‌ల ద్వారా ఇస్తున్న శిక్షణపై విద్యార్థులతో చర్చించారు. మంత్రి మాట్లాడుతూ కుప్పంలో హబ్‌ను ప్రారంభించడం జరిగిందన్నారు. దీని ద్వారా వివిధ రకాల శిక్షణను విద్యార్థులకు అందించి, వారిలో మేదోశక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. దీని ద్వారా నిరుద్యోగులు తమకు నచ్చిన వాటిలో స్థిరపడి అభివృద్ధి చెందేందుకు వీలుందన్నారు. నిరుద్యోగుల కోసం అన్ని రకాలుగా సేవలు అందిస్తామని తెలిపారు. ఈ అవకాశాలను నిరుద్యోగులు వినియోగించుకోవాన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ ముత్తంశెట్టి విశ్వనాథ్‌, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, జిల్లాస్కిల్‌ డెవలెప్‌మెంట్‌ అధికారి గుణశేఖర్‌రెడ్డి, ఎంపీడీవో రామనాథరెడ్డి, ప్రిన్సిపాల్‌ శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Training to develop skills among the youth – State Minister Dr. Peddireddy Ramachandra Reddy

Post Midle