రంగంలోకి ట్రముల్ షూటర్

మెదక్ ముచ్చట్లు:

 

హుజురాబాద్‌లో ట్రబుల్ షూటర్ ఎంట్రీ ఎప్పుడో తెలుసా..? ఇప్పటి వరకు రంగనాయక‌సాగర్ కేంద్రంగా సమీకరణలు జరిపిన ఆయన మరో నాలుగైదు రోజుల్లో డైరక్ట్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. హుజురాబాద్ కేంద్రంగానే తన మార్క్ పాలి’ట్రిక్స్‘కు శ్రీకారం చుట్టబోతున్నారు. మిత్రుని ఓటమి కోసం ప్రత్యక్ష్యంగా రంగంలోకి దిగబోతున్నారు.హుజురాబాద్ బై పోల్ ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్న మంత్రి తన్నీరు హరీష్ రావు ఇప్పటి వరకు సైలెంట్ గేమ్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పటివరకు రంగనాయక‌సాగర్ ప్రాజెక్టు గెస్ట్ హౌజ్ కేంద్రంగా హుజురాబాద్‌లోని వివిధ వర్గాలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. విభాగాల వారీగా సమయం కేటాయించిన ఆయన వారిచే ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసి వారిలో ఒకడిగా కలిసిపోయేందుకే అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు.రంగనాయకసాగర్ గెస్ట్ హౌజ్ కేంద్రంగా హుజురాబాద్ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసుకున్న హరీష్ రావు ప్రతి విషయంలోనూ ప్రత్యేకతలను చూపించారు. తన ముఖ్యమైన అనుచరులచే మాత్రమే అక్కడ సేవలందించేందుకు ప్లాన్ చేసుకున్నారు.

 

 

 

అతిథి మర్యాదలు ఇచ్చిన తరువాత ఒక్కో మీటింగ్ నాలుగు గంటల పాటు నిర్వహించారు. ఇందులో తన ప్రసంగంతో పాటు అక్కడికి వచ్చిన వారి అవసరాలను తీర్చేందుకే ప్రయారిటి ఇచ్చారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన అన్ని వర్గాలతో ప్రత్యేకంగా జరుపుతున్న సమావేశాలు కూడా మరో రెండు, మూడు రోజుల్లో ముగియనున్నాయని తెలుస్తోంది.రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తున్న పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి. ఆ తరువాత నుంచి హుజురాబాద్ కేంద్రంగా హరీష్ రావు తన మార్క్ పాలిటిక్స్ ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల హరీష్ రావుతో సమావేశం అయిన వారితో కూడా ఇదే విషయం చెప్పారట. దీంతో ఈ నెల10 తరువాత ఆయన హుజురాబాద్‌కు వచ్చే అవకాశాలు ఉన్నట్టు స్పష్టం అవుతోంది.హరీష్ రావు ఎంట్రీతో హుజురాబాద్-బైపోల్ రాజకీయ సెగ పుట్టించనుంది.

 

రాష్ట్ర మొదటి, రెండో ఆర్థిక మంత్రుల మధ్య రసవత్తర రాజకీయాలకు తెరలేపనుంది. ఇప్పటి వరకు సన్నిహితులుగా ముద్రపడ్డ హరీష్ రావు, ఈటల రాజేందర్‌లు.. బై-పోల్‌లో ప్రత్యర్థులుగా మారనున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని ఇంతవరకు ప్రకటించకపోవడంతో హరీష్ రావు ఎంట్రీతో ఆయనే అభ్యర్థి అన్నట్టుగా తన ప్రచారాన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నాయకులు సీరియస్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో హరీష్ రావు ఒక్కడే టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత రెడ్డి గెలుపు కోసం వ్యూహ ప్రతి వ్యూహాలు రచించారు. ఓటమి ఖాయం అనుకున్న పరిస్థితి నుంచి నువ్వా-నేనా అన్న పరిస్థితికి తీసుకొచ్చారు. అంతేకాకుండా గతంలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో కూడా హరీష్ రావు తన మార్క్ పాలిటిక్స్ ప్లే చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు హుజురాబాద్ కేంద్రంగా తన మార్క్ రాజకీయాలను ప్రారంభించారు. అయితే దాదాపు గత నెల రోజులుగా హుజురాబాద్ వైపు కన్నెత్తి చూడకుండానే హరీష్ తన బ్రాండ్ స్టెప్స్ వేశారు. త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్న ఆయన ఎలాంటి ఎత్తుగడలతో ముందుకు సాగుతారోనన్న చర్చ హాట్ టాపిక్‌గా మారింది.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Trammul shooter into the field

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *