Transfer of 27 IAS Officers in Andhra Pradesh

ఆంధ్రాలో 27 మంది ఐఏఎస్‌ ఆఫీసర్ల బదిలీ

Date:10/05/2020

అమరావతి ముచ్చట్లు:

ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 27 మంది ఐఏఎస్‌ ఆఫీసర్లకు పదోన్నతి కల్పించి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఐఏఎస్‌ ఆఫీసర్ల బదిలీలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం రైతు భరోసా రెవెన్యూ జాయింట్‌ కలెక్టర్‌గా సుమిత్‌కుమార్‌ను నియమించింది. అలాగే అక్కడున్న డాక్టర్‌ కె.శ్రీనివాసులును బదిలీ చేసి అదే జిల్లా గ్రామ వార్డు సచివాలయాల జేసిగా నియమించారు. విజయనగరం జేసిగా ఉన్న జి.క్రిష్టకిషోర్‌కుమార్‌ను అదే జిల్లాలో రైతు భరోసా కేంద్రాల జేసిగా నియమించారు. విజయనగరం వార్డు సచివాలయాల జేసిగా మహేష్‌కుమార్‌ రవిరాలను నియమించారు. విశాఖపట్నం రైతు భరోసా జేసిగా వేణుగోపాల్‌రెడ్డిని , వార్డు సచివాలయాల జేసిగా అరుణ్‌బాబును నియమించారు. ఈస్ట్గోదావరి రైతు భరోసా రెవెన్యూ జేసిగా జి.లక్ష్మిషాను నియమించారు. అదే జిల్లాకు వార్డు సచివాలయాల జేసిగా కీర్తి చేకూరిని నియమించారు. అలాగే వెస్ట్ గోధావరి రెవెన్యూ, రైతు భరోసా జేసిగా కె.వెంకట్రమణారెడ్డిని నియమించారు. అదే జిల్లా వార్డు సచివాలయాల జేసిగా హిమాన్షూసుక్లాను నియమించారు.

 

 

 

కె.మాదవిలతను క్రిష్ణాజిల్లా రైతు భరోసా రెవెన్యూ జేసిగా నియమించారు. అదే జిల్లాకు వార్డు సచివాలయాల జేసిగా శివశంకర్‌లోహితి నియమించారు. గుంటూరు జిల్లా రైతుభరోసా రెవెన్యూ జేసిగా దినే ష్‌కుమార్‌ను నియమించారు. అదే జిల్లా వార్డు సచివాలయాల జేసిగా పి.ప్రశాంతిని నియమించారు. ప్రకాశం జిల్లా రైతు భరోసా రెవెన్యూ జేసిగా జె.వెంకటమురళిని నియమించారు. అదే జిల్లా గ్రామ సచివాలయాల జేసిగా టిఎస్‌.చేతన్‌ను నియమించారు. నెల్లూరు జిల్లా రెవెన్యూ, రైతు భరోసా జేసిగా వి.వినోద్‌కుమార్‌ను నియమించారు.

 

 

 

అదే జిల్లా గ్రామ సచివాలయాల జేసిగా ఎన్‌.ప్రభాకర్‌రెడ్డిని నియమించారు. చిత్తూరు జిల్లా రె వెన్యూ, రైతు భరోసా జేసిగా డి.మార్కెండేయులను నియమించారు. అదే జిల్లా గ్రామ సచివాలయాల జేసిగా వి.వీరబ్రహ్మయ్యను నియమించారు. వైఎస్‌ఆర్‌ జిల్లా రైతు భరోసా రెవెన్యూ జేసిగా ఎం.గౌతమిని నియమించారు. అదే జిల్లా గ్రామ సచివాలయాల జేసిగా సీఎం .సాయికాంత్‌వర్మను నియమించారు. అనంతపురం రైతు భరోసా రెవెన్యూ జేసిగా నిశాంత్‌కుమార్‌ను నియమించారు. అదే జిల్లా గ్రామ సచివాలయాల జేసిగా ఎస్‌.ఢిల్లీరావును నియమించారు. కర్నూల్‌జిల్లా రెవెన్యూ రైతు భరోసా జేసిగా పి.రవిసుభాష్‌ను నియమించారు. అదే జిల్లా గ్రామ సచివాలయాల జేసిగా ఎస్‌.రామసుందర్‌రెడ్డిని నియమించారు. బదిలీలు కాబడిన ఐఏఎస్‌ య్ధికారులందరు నిబంధనల మేరకు విధుల్లో చేరాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని ఆదేశాలలో పేర్కొన్నారు.

  ఎల్బీనగర్‌లో విజృంభిస్తున్న కరోన

Tags: Transfer of 27 IAS Officers in Andhra Pradesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *