Natyam ad

పుంగనూరులో న్యాయమూర్తులు బదిలీ

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని రెండు కోర్టుల న్యాయమూర్తులను బదిలీ చేస్తూ హైకోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి కోర్టు న్యాయమూర్తి కార్తీక్‌, అలాగే అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి కోర్టు న్యాయమూర్తి సిందును బదిలీ చేశారు. వీరు బార్యభర్తలు కావడంతో వీరిద్దరిని విశాఖపట్నం కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయింది. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు ఆకుల చెన్నకేశవులు ఆధ్వర్యంలో న్యాయమూర్తుల సేవలను కొనియాడి వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో అడిషినల్‌ పిపి హరినాథరెడ్డి, న్యాయవాదులు శివశంకర్‌నాయుడు, పులిరామకృష్ణారెడ్డి, బాలాజికుమార్‌, హితేంద్రరెడ్డి, ప్రకాష్‌, ఆనందకుమార్‌, శ్రీనివాసులు, రవీంద్రనాథ్‌, ప్రశాంతి, మున్ని తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags; Transfer of judges in Punganur

 

Post Midle