ఏపీలో పలువురు ఐపీఎస్ ల బదిలీలు
అమరావతి ముచ్చట్లు:
రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. డీజీపీ రాజేంద్రనాధ్ సింగ్ మంగళవారం నాడు బదిలీ ఉత్తర్వులను జారీ చేసారు.
విజిలెన్ ఎన్ఫోర్స్ మెంట్ ఏడీజీ గా వున్న రవి శంకర్ అయ్యనార్ ను విశాఖపట్నం పోలీసు కమిషనర్ గా నియమించారు. అక్కడున్న త్రివిక్రమ వర్మను బదిలీ చేసారు. అయనను స్పెషల్ ప్రటెక్షన్ ఫోర్స్ ఐజీగా నియమించారు. రైల్వేలో వున్న కుమార్ విశ్వజిత్ ను విజిలెన్ ఎన్ఫోర్స్ మెంట్ ఏడీజీగా నియమించారు. ఆక్టోపస్ ఎస్పీగా వున్న సిద్దార్ద్ కౌశల్ ను కడప ఎస్పీగా నియమించారు. అక్కడున్న అన్బురాజన్ ను అనంతపురం ఎస్పీగా బదిలీ చేసారు.
అనంతపురం ఎస్పీగా వున్న కే శ్రీనివాస రావును విశాఖపట్నం నగర్ డిసిపి (శాంతి భద్రతలు)గా ఉత్తర్వులిచ్చారు. అక్కడున్న విద్యాసాగర్ నాయుడును ఎస్పీ గ్రేహౌండ్స్ గా బదిలీ చేసారు.
ఏసీబీ ఎస్పీగా వున్న కృష్ణారావు బొడ్డెపల్లిను అన్నమయ్య జిల్లా ఎస్పీగాను, అక్కడున్న గంగాధర్ రావును అనంతపురంలోని 14 వ బెటాలియన్ కమాండెంట్ గాను, అక్కడ వున్న జగదీష్ ను తూర్పు గోదావరి ఎస్పీగా నియమించారు. గ్రే హౌండ్స్ గ్రూప్ కమాండెంట్ గా వున్న ఆద్నాన్ నయీం ఆస్మీని ఏసీబీ లో ఎస్పీగా నియమించారు.

Tags: Transfer of many IPS in AP
