ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

అమరావతి ముచ్చట్లు:
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ను కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్గా బదిలీ చేసారు. అయనకు  సాంకేతిక విద్య డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే ఏపీ టూరిజం ఎండీ ప్రవీణ్కుమార్ ను ప్రకాశం జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసింది. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఐఏఎస్ అధికారి ఎస్ సత్యనారాయణను ఏపీ టూరిజం ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.  అలాగే పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న మరో అధికారి  బసంత్కుమార్ను మున్సిపల్ శాఖలో ఎంఐజీ ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. అయనకు ఏపీయూఎఫ్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిoది.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:Transfer of several IAS officers in AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *