ఏపీ లో 16 మంది ఐపీఎస్ అధికారుల  బదిలీలు

అమరావతి  ముచ్చట్లు:
ఏపీ లో పదహారు మంది ఐపీఎస్ రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీ, పదోన్నతిని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులిచ్చారు. విజయనగరం ఎస్పీ రాజకుమారికి డీఐజిగా పదోన్నతికి దిశా డీఐజీగా నియమించారు. డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ డీఐజీగానూ రాజకుమారికి బాధ్యతలు అప్పగించారు. విజయనగరం ఎస్పీగా ఎం.దీపిక, సి.హెచ్.విజయరావును నెల్లూరు ఎస్పీగా, ఎం.రవీంద్రనాథ్ బాబును తూ.గో. జిల్లా ఎస్పీగా బదిలీ చేసారు. అద్నాన్ నయీమ్ హస్మిని గ్రే హౌండ్స్ కమాండర్‌గా, కృష్ణా జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్ కౌశల్ నియమించారు. రిశాంత్‌రెడ్డి గుంటూరు జిల్లా అడ్మిన్ అదనపు ఎస్పీగా,  సతీశ్‌కుమార్‌కు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీగా బదిలీ చేసారు.  విద్యాసాగర్ నాయుడుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు.  గరికపాటి బిందు మాధవ్‌ను ఎస్ఈబీ అదనపు ఎస్పీగా, తుహిన్ సిన్హాను ఎస్ఈబీ అదనపు ఎస్పీగా,  పి జగదీష్  విశాఖపట్నం జిల్లా, పాడేరు సహాయ ఎస్పీగా, జి కృష్ణకాంత్‌ను తూర్పుగోదావరి జిల్లా, చింతూర్ సహాయ ఎస్పీగా,  వి ఎన్ మణికంఠ ఛందోలును విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నం అసిస్టెంట్ ఎస్పీగా, కృష్ణకాంత్ పాటిల్ ను తూర్పుగోదావరి జిల్లా, రంపచోడవరం అసిస్టెంట్ ఎస్పీగా,  తుషార్ దూడిని విశాఖపట్నం జిల్లా, చింతపల్లి అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ చేసారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Transfers of 16 IPS officers in AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *