పుంగనూరులో అధికారుల బదిలీలు

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని సబ్‌రిజిస్ట్రార్‌ వెంకట సుబ్బయ్య కుప్పంకు బదిలీ అయ్యారు. శనివారం ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కార్వేటినగరం సబ్‌రిజిస్ట్రార్‌ బాలాజి ను పుంగనూరుకు ఎస్‌ఆర్‌వోగా బదిలీ చేశారు. అలాగే సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఉదయ్‌కుమార్‌రెడ్డిని అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట ఎస్‌ఆర్‌వో కార్యాలయానికి బదిలీ చేశారు. ఇక్కడికి డిఐజి కార్యాలయం చిత్తూరులో ఉన్న హరికుమార్‌ను బదిలీ చేశారు. అలాగే మున్సిపల్‌ కార్యాలయంలో అకౌంట్స్ ఆఫీసర్‌ మనోహర్‌ను పలమనేరుకు, సీనియర్‌ అకౌంటెంట్‌ రమాదేవికి జేఏవోగా పదోన్నతి కల్పిస్తూ శ్రీకాళహస్తి మున్సిపాలిటికి బదిలీ చేశారు. అలాగే శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సురేంద్రబాబును మదనపల్లెకు బదిలీ చేశారు.

 

Tags: Transfers of officers in Punganur

Post Midle
Post Midle