Natyam ad

ట్రాన్స్ఫార్మర్ దొంగలు అరెస్ట్ – రూ.8,26,800 విలువగల కాపర్ వైరు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం.

చిత్తూరు ముచ్చట్లు:
Post Midle
 జిల్లాకు చెందిన నలుగురు మరియు తమిళనాడుకు చెందిన ఇద్దరు ట్రాన్స్ఫార్మర్ దొంగలు అరెస్ట్ మరియు రూ.8,26,800 విలువగల కాపర్ వైరు మరియు మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం.చిత్తూరు జిల్లా యన్.ఆర్.పేట పోలీసు స్టేషనులో నమోదైన ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కేసులలోని దొంగల గురించి వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు చిత్తూరు జిల్లా SP, .Y.రిషాంత్  IPS వారి ఆదేశాలు మేరకు, చిత్తూరు సబ్ డివిషనల్ అధికారి K.శ్రీనివాస మూర్తి వారి పర్యవేక్షణలో, చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ M.గంగిరెడ్డి  అద్వర్యంలో, యన్.ఆర్.పేట పోలీసు స్టేషను సబ్ ఇన్స్పెక్టర్ K.V.సుబ్బమ్మ, చిత్తూరు తాలూక పోలీసు స్టేషను సబ్-ఇన్స్పెక్టరు ఉమామహేశ్వర్ రెడ్డి ,  జి.డి. నెల్లూరు పోలీసు స్టేషను సబ్-ఇన్స్పెక్టరు B.రామాంజినేయులు ,  మరియు చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ క్రైమ్ సిబ్బంది PC-3652, సుధాకర్, PC-1701 రాజ్ కుమార్ మరియు యన్.ఆర్.పేట పోలీసు సిబ్బంది సహాయంతో  చిత్తూరు జిల్లాకు చెందిన ఐదు మంది మరియు తమిళనాడుకు చెందిన ఇద్దరు ట్రాన్స్ఫార్మర్ దొంగలును  13.01.2024  వ తేది ఉదయం 06.30 గం. లకు   చిత్తూరు రూరల్ మండలము,   చిత్తూరు – తిరుత్తణి రోడ్డు మీద, కుర్చివేడు క్రాస్ వద్ద వద్ద అరెస్ట్ చేయడం జరిగినది.  వారి వద్ద నుండి  3 ద్విచక్ర వాహనములు, 757 KGs కాపరు వైరు మరియు 250 మీటర్లు కరెంటు కేబుల్ వైరును స్వాధీనం చేసు కొనడమైనది.
ముద్దాయిల వివరములు ఈ క్రింద కనపర్చబడ్డవి.
1. Suriya Elumalai, aged 23 years, s/o Elumalai, Cast by SC, R/o D.No. 100B, VM Steet, VTC Rendadi, Valaja Taluk, Vellore Dist., Tamil Nadu State
2. R.Dinesh, aged 22 years, s/o R.Ravi, Caste by SC, D.No.7-61-A, Kanikapuram hw, Vengalrajakuppam, Palasamudram Mandal, Chittoor Dist.,
3. P.Adithya, aged 19 years, s/o A.Prabhu Kumar, Caste by SC, R/o D.No.1-120, VR Kuppam DW, Vengalraja Kuppam, Palasamudram Mandal, Chittoor Dist.,
4. A.Praveen Kumar, aged 23 years, s/o A.Babu, Caste By SC, R/o Indira Nagar, Vengalraja Kuppam, Palasamudram Mandal, Chittoor Dist.,
5. Ali Abbas, aged 25 years, s/o D.Raju@Nanjujohn, Caste by Muslim(Dhedhakula), R/o D.No.341, Dheenabandhapuram Village, Vengalraja Kuppam, Palasamudram Mandal, Chittoor Dist.,
6. E.Sivalingam, aged 30 years, s/o Elumalai, Cast by SC, R/o D.No. 100B, VM Steet, VTC Rendadi, Valaja Taluk, Vellore Dist., Tamil Nadu State.
పై తెలిపిన ముద్దాయిలు ఇదివరకు చాలా కేసులలో ముద్దాయిలుగా వున్నారు.
ఈ కేసును అతి తక్కువ కాలంలో చేదించినందుకు సబ్ డివిషనల్ పోలీస్ అధికారి . K. శ్రీనివాస మూర్తి  పోలీసు అధికారులు మరియు సిబ్బందిని క్యాష్ రివార్డ్ తో అభినందించారు.

 

Tags: Transformer thieves arrested – Copper wire worth Rs.8,26,800, two wheelers seized.

Post Midle