Natyam ad

మరాఠలో ట్రాన్స్ జెండర్ల కాలమ్

ముంబై  ముచ్చట్లు:


మహారాష్ట్రలో విద్య, ఉద్యోగాల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తుల్లో, ఇతర సంబంధిత ప్రొఫార్మాలలో లింగ నిర్ధారణకు సంబంధించి స్త్రీ , పురుష  ఆప్షన్లతో పాటు ట్రాన్స్ జెండర్  ఆప్షన్ ను కూడా పొందుపర్చనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం బొంబాయి హై కోర్టుకు తెలిపింది.విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు సంబంధించిన దరఖాస్తుల్లో, ఉద్యోగ భర్తీకి సంబంధించిన దరఖాస్తుల్లో ఇకపై లింగ నిర్ధారణకు సంబంధించి మూడు ఆప్షన్లు ఉంటాయని మహారాష్ట్ర ప్రభుత్వం బొంబాయి హై కోర్టుకు తెలిపింది. అవి స్త్రీ , పురుష  ఆప్షన్లతో పాటు ట్రాన్స్ జెండర్ ఆప్షన్లు అని వివరించింది. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను వారం రోజుల్లో జారీ చేస్తామని తెలిపింది. అప్లికేషన్ ఫామ్ లో లింగ నిర్ధారణకు సంబంధించి స్త్రీ, పురుష అనే రెండు ఆప్షన్లు మాత్రమే ఉండి, ట్రాన్స్ జెండర్ ఆప్షన్ లేకపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ రంగ విభాగం మహా ట్రాన్స్ కో లో అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోలేకపోయానని ఒక ట్రాన్స్ జెండర్  దాఖలు చేసిన పిటిషన్ పై మహారాష్ట్ర ప్రభుత్వం పై విధంగా స్పందించింది.బొంబాయి హైకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణ కారణంగా మరో సమస్య కూడా పరిష్కారమైంది. పోలీసు విభాగంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అప్లికేషన్లలో థర్డ్ జెండర్ ఆప్షన్ ను కూడా చేర్చాలని మహారాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టులో సవాలు చేసింది. తాజాగా, ఇక అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ దరఖాస్తుల్లో, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తుల్లో థర్డ్ జెండర్ ఆప్షన్ ఉండేలా ఆదేశాలు జారీ చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం బొంబాయి హై కోర్టుకు తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా  మహారాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఆదేశాలను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ రద్దు అవుతుంది. అంటే, ఇకపై మహారాష్ట్ర పోలీస్ విభాగంలో ఉద్యోగాల కోసం, తాము ట్రాన్స్ జెండర్లమని స్పష్టం చేసి మరీ, ట్రాన్స్ జెండర్స్అప్లై చేసుకోవచ్చు.

 

Tags; Transgender column in Maratha

Post Midle
Post Midle