సత్తుపలిల్లో  ట్రాన్స్‌జెండర్స్‌ హల్‌చల్‌

ఖమ్మం  ముచ్చట్లు:

ఖమ్మం జిల్లా సత్తుపలిల్లో కొందరు ట్రాన్స్‌జెండర్స్‌ హల్‌చల్‌ చేశారు. రెండు గ్రూపులుగా విడిపోయి రోడ్డుపైనే కొట్టుకున్నారు.  దుస్తులు చించుకుంటూ రచ్చ రచ్చ చేశారు.  దీంతో స్థానికులతో పాటు రోడ్డుపై వెళుతున్న వాహనదారులు, పాదచారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కాగా కొందరు ట్రాన్స్‌జెండర్స్‌ వేరే ప్రాంతం నుంచి వచ్చి సత్తుపల్లిలో ఉన్నట్లు తెలిసింది. దీంతో స్థానికంగా ఉన్న ట్రాన్స్‌జెండర్స్‌ తమ ప్రాంతంలోకి ఎందుకొచ్చావంటూ గొడవకు దిగారు. మొదట మాటలతో మొదలైన గొడవ ఆ తర్వాత పరస్పరం కొట్టుకునేదాకా వెళ్లింది. ‘మా చేయి కొరికేశారు. డ్రెస్సులు చించేశారు. వీరు మగవాళ్లు. ఎక్కడో నుంచో వచ్చి ఇక్కడ మా ఆడవాళ్ల మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇక్కడ దందా చేస్తే మేం అసలు ఒప్పుకోం’ అంటూ దుస్తులు చించుకునేదాకా వెళ్లారు ట్రాన్స్‌ జెండర్లు.నడిరోడ్డుపైనే ట్రాన్స్‌జెండర్లు గొడవకు దిగడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ట్రాన్స్‌జెండర్లను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు పెరిగిపోయాయి. కొన్ని మార్గాలను ఎంచుకుంటున్న ముఠాలు, అమ్మాయిలు, అబ్బాయిలతో ట్రాన్స్‌జెండర్ల వేషాలు వేయించి వాహనదారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు వెలుగుచూశాయి.

 

Tags: Transgenders are hustling in Sattupali

Post Midle
Post Midle