Natyam ad

ఎన్నికల సిబ్బందికి రవాణా సదుపాయం

-జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్. షణ్మోహన్.

 

చిత్తూరు  ముచ్చట్లు:

 

Post Midle

ఈ నెల 13వ తేదీన జరిగే పోలింగ్ ప్రక్రియకు హాజరయ్యే ఎన్నికల పోలింగ్ సిబ్బందికి వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు బస్సు రవాణా కల్పించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి ,జిల్లా కలెక్టర్ ఎస్.షణ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.13.05.2024 తేదీన జరగబోవు సాధారణ ఎన్నికలకు కేటాయించిన సిబ్బంది వారికి కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లుటకు 12.05.2024 తేదీన ఉదయము 02.00 గంటల నుండి మరియు ఎన్నికలు ముగిసిన తరువాత సిబ్బంది తిరుగు ప్రయాణానికి వెళ్లుటకు 13.05.2024 తేదీన రాత్రి 09.00 గంటలనుండి ఈదిగువ పేర్కొన్న రూట్ల యందు బస్సు సౌకర్యము కల్పించబడినదని తెలిపారు.

 

చిత్తూరు -1 డిపో…

1. చిత్తూరు – పుంగనూరు (వయా పలమనేరు) మార్గము నందు 10 బస్సులు ఉ .4.30 గంటలకు బయలుదేరును.

2. చిత్తూరు – కుప్పం (వయా పలమనేరు) మార్గము నందు 06 బస్సులు ఉ . 4.00 గంటలకు బయలుదేరును.

3. చిత్తూరు – పూతలపట్టు మార్గము నందు 12 బస్సులు ఉ .6.00 గంటలకు బయలుదేరును.

4. పూతలపట్టు – కుప్పం (వయా చిత్తూరు) మార్గము నందు 01 బస్సులు ఉ .4.00 గంటలకు బయలుదేరును.

5. పూతలపట్టు – పుంగనూరు (వయా పలమనేరు) మార్గము నందు 02 బస్సులు ఉ .5.00 గంటలకు బయలుదేరును.

6. జి.డి. నెల్లూరు – పుంగనూరు (వయా చిత్తూరు, పలమనేరు) మార్గము నందు 03 బస్సులు ఉ .4.30 గంటలకు బయలుదేరును.

7. జి.డి. నెల్లూరు – కుప్పం (వయా చిత్తూరు, పలమనేరు) మార్గము నందు 01 బస్సులు ఉ . 4.30 గంటలకు బయలుదేరును.

8 .జి.డి. నెల్లూరు – పూతలపట్టు (వయా చిత్తూరు) మార్గము నందు 02 బస్సులు ఉ .5.30 గంటలకు బయలుదేరును.

 

 

 

చిత్తూరు -2 డిపో…

1. చిత్తూరు – పలమనేరు మార్గము నందు 06 బస్సులు ఉ .5.30 గంటలకు బయలుదేరును.

2. జి.డి. నెల్లూరు – పలమనేరు ( వయ చిత్తూరు)మార్గము నందు 02 బస్సులు ఉ .5.30 గంటలకు బయలుదేరును.

3. పూతలపట్టు – పలమనేరు (వయ చిత్తూరు) మార్గము నందు 03 బస్సులు ఉ. 5.00 గంటలకు బయలుదేరును.

4. చిత్తూరు – నగరి (వయ జి. డి నెల్లూరు) మార్గము నందు 34 బస్సులు ఉ. .4.00 గంటలకు బయలుదేరును.

5. పూతలపట్టు – జి. డి. నెల్లూరు (వయ చిత్తూరు) మార్గము నందు 05 బస్సులు ఉ .5.30 గంటలకు బయలుదేరును.

6 . నగిరి – పుంగనూరు మార్గము నందు 01 బస్సులు ఉ .3.00 గంటలకు బయలుదేరును.

 

 

7 . నగిరి – చిత్తూరు (వయ జి.డి.నెల్లూరు) మార్గము నందు 02 బస్సులు ఉ . 4.30 గంటలకు బయలుదేరును.

8 . నగిరి – పూతలపట్టు మార్గము నందు 02 బస్సులు ఉ .4.30 గంటలకు బయలుదేరును.

9 . నగిరి – కుప్పం (వయ పలమనేరు) మార్గము నందు 02 బస్సులు ఉ . 2.00 గంటలకు బయలుదేరును.

పలమనేరు డిపో…

1. పలమనేరు – పుంగనూరు మార్గము నందు 05 బస్సులు ఉ .6.00 గంటలకు బయలుదేరును.

2. పలమనేరు – నగిరి మార్గము నందు 02 బస్సులు ఉ .4.00 గంటలకు బయలుదేరును.

3. పలమనేరు – జి. డి. నెల్లూరు (వయ చిత్తూరు) మార్గము నందు 08 బస్సులు ఉ .5.30 గంటలకు బయలుదేరును.

4. పలమనేరు – పూతలపట్టు (వయ చిత్తూరు) మార్గము నందు 07 బస్సులు ఉ.5.00గంటలకు బయలుదేరును. . .

5 . పలమనేరు – కుప్పం మార్గము నందు 09 బస్సులు ఉ .4.30 గంటలకు బయలుదేరును.

 

 

పుంగనూరు డిపో…

1. పుంగనూరు – నగిరి మార్గము నందు 05 బస్సులు ఉ .3.00 గంటలకు బయలుదేరును.

2. పుంగనూరు – జి.డి.నెల్లూరు (వయ చిత్తూరు) మార్గము నందు 11 బస్సులు ఉ .4.00 గంటలకు బయలుదేరును.

3. పుంగనూరు – పూతలపట్టు మార్గము నందు 10 బస్సులు ఉ .4.30 గంటలకు బయలుదేరును.

4. పుంగనూరు – పలమనేరు మార్గము నందు 04 బస్సులు ఉ .6.00 గంటలకు బయలుదేరును.

5 . పుంగనూరు – కుప్పం మార్గము నందు 04 బస్సులు ఉ .3.30 గంటలకు బయలుదేరును.

 

కుప్పం డిపో…

1. కుప్పం – పుంగనూరు మార్గము నందు 14 బస్సులు ఉ.4.00 గంటలకు బయలుదేరును.

2. కుప్పం – నగిరి మార్గము నందు 02 బస్సులు ఉ .2.00 గంటలకు బయలుదేరును.

3. కుప్పం – జి. డి. నెల్లూరు (వయ చిత్తూరు) మార్గము నందు 07 బస్సులు ఉ . 3.30 గంటలకు బయలు దేరును.

4. కుప్పం – పూతలపట్టు మార్గము నందు 09 బస్సులు ఉ .3.30 గంటలకు బయలుదేరును.

5 . కుప్పం – పలమనేరు మార్గము నందు 05 బస్సులు ఉ . 5.00 గంటలకు బయలుదేరును.

పైన పేర్కొన్న మార్గము లందు ఎన్నికల విధులకు హాజరగు సిబ్బంది సౌకర్యార్ధము 12.05.2024 తేదీన ఉదయము 02:00 గంటల నుండి బయలుదేరు విధముగా బస్సులను ఏర్పాటు చేయడమైనదన్నారు.

 

 

అదే విధముగా 13.05.2024 తేదీన ఎన్నికలు ముగిసిన పిదప ఎన్నికల సిబ్బంది తిరుగు ప్రయాణానికి రాత్రి 09:00 గంటల తరువాత పైన తెలిపిన మార్గములందే కాకుండా అదనముగా మదనపల్లి నుండి చిత్తూరు, కుప్పం, పుంగనూరు, నగిరి (వయ జి.డి.నెల్లూరు), పూతలపట్టు కు మరియు తిరుపతి నుండి పుంగనూరు, నగిరి, జి.డి.నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, కుప్పం (వయ పలమనేరు) పట్టణములకు కూడా బస్సులు ఏర్పాటు చేయడమైనది.
ఈ ఎన్నికలకు గాను జిల్లా వ్యాప్తంగా 200 RTC బస్సులను, 02 RTC D.G.T లు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

 

Tags:Transport facility for election personnel

Post Midle