ప్రేమ పేరుతో ట్రాప్..!

* ఆపై బెదిరింపులకు దిగి డబ్బు వసూలు
* శారీరక వాంఛ తీర్చాలంటూ వేధింపులు
* కామాంధుడి వలలో 200మంది యువతులు..!
* వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం యువకుడి నిర్వాకం..!

Date:10/06/2020

వరంగల్ రూరల్ ముచ్చట్లు:

* అమాయక యువతులే అతడి టార్గెట్. సోషల్ మీడియా సాయంతో వల పన్నడం. ఆ యువతులతో చాటింగ్ చేసి ప్రేమలోకి దింపడం. ఆ తర్వాత వారి ఫోటోలు, వీడియోలు సేకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానంటూ.. బెదిరింపులకు పాల్పడడం. ఈ క్రమంలో కొందరిని నుంచి డబ్బులు వసూలు చేస్తూ… మరి కొందరిని మాత్రం శారీరక వాంఛ తీర్చాలంటూ టార్చర్ పెట్టేవాడు.

* షీ టీం కృషితో…
ఈ కామాంధున్ని నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

* నల్గొండ ఎస్పీ రంగనాధ్ గారు తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్​ రూరల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన అఖిల్ అలియాస్ చందు… సికింద్రాబాద్​ అడ్డుగుట్టలోని ఓ హోమ్​కేర్ సెంటర్లో వార్డు బాయ్​గా పని చేసేవాడు. అక్కడ పనిచేస్తున్న క్రమంలోనే ఉద్యోగం కోసం సిటీకి వస్తున్న యువతులతో మెల్లగా పరిచయం చేసుకొని వారి ఫోన్ నంబర్లు తీసుకునేవాడు.

* సోషల్ మీడియా ద్వారాప్రేమిస్తున్నాను అంటూ చాటింగ్, వీడియో కాల్స్​ చేసి వారి ఫొటోల్ని సేకరించేవాడు. సేకరించిన ఫోటోలను ఫేస్ బుక్ లో పెడతాను అంటూ కొందరిని డబ్బులు ఇవ్వాలని, మరి కొందరిని కోరిక తీర్చాలని బలవంత పెట్టేవాడు.

* ( అతని ఫోన్ చెక్ చేయడంతో…) దాదాపు 200 మంది యువతులు అతని ట్రాప్ లో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇతని చర్యలతో విసిగిపోయిన, నల్గొండకు చెందిన ఓ అమ్మాయి ధైర్యంగా షీటీమ్​ను సంప్రదించడంతో అసలు బండారం బయట పడింది.

* ఇదిలా ఉండగా… అతనిపై ఇంతకు ముందు కూడా కేసులు ఉన్నాయని, తప్పించుకుంటూ తిరిగేవాడని అన్నారు.

* ఇలాంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వీళ్ళతో ఎలాంటీ సమాస్య ఎదురైనా తప్పక దగ్గరలోని పోలీసులను ఆశ్రయించాలని జిల్లా ఎస్పీ ఎ.వి. రంగనాథ్  తెలిపారు.

షకీల సినిమాకు సెన్సార్ నుండి క్లీన్ యు సట్టిఫికెట్

Tags: Trap in the name of love ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *