Natyam ad

దారి ఖర్చులు రావడం లేదు

కర్నూలు ముచ్చట్లు:

దారిఖర్చులు కూడా రావడం లేదంటూ టమోటా రైతులు విలవిలలాడుతున్నారు. రైతులకు కిలో టమోటాకు రెండు రూపాయలలోపే ధర లభిస్తోంది. కనీసం కూలి, రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో ఆరుబయట పారబోసేసి రైతులు తమ నిరసన తెలుపుతున్నారు. పది రోజుల నుంచి టమోటా ధర దారుణంగా పడిపోతూ వచ్చింది శనివారం ఒక గంప (15 కిలోలు)కు రూ.25 ధర మాత్రమే లభించింది. దీంతో, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎకరా విస్తీర్ణంలో టమోటా సాగుకు రూ.50 వేల పెట్టుబడి అవుతోంది. ఎకరాకు ఎనిమిది నుంచి పది టన్నుల వరకూ దిగుబడి వస్తుంది. ఇప్పటి ధర ప్రకారం రూ.15 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదు. 2010 సంవత్సరం కంటే ముందు ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 20 వేల ఎకరాల్లో టమోటాను సాగు చేసేవారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా నాటు రకమైన టమోటా పండించేవారు. రాష్ట్రంలోని మదనపల్లి, అనంతపురం, కర్ణాటక రాష్ట్రంలోని చింతామణి తదితర ప్రాంతాల్లో హైబ్రిడ్‌ రకం టమోటా సాగు చేయడంతో ఎక్కువ దిగుబడితోపాటు నాణ్యమైన పంట వస్తోంది. నాటు టమోటాకు డిమాండ్‌ కరువవడంతో క్రమంగా సాగు విస్తీర్ణం తగ్గింది. ఆ తర్వాత ఇక్కడి వారు కూడా హైబ్రిడ్‌ రకం టమోటా సాగు ప్రారంభించారు. దీంతో, క్రమంగా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. కర్నూలు జిల్లాలోని ఆదోని, ఆస్పరి, పత్తికొండ, ప్యాపిలి, డోన్‌ ప్రాంతాల్లో ఈ ఏడాది దాదాపు 7,500 ఎకరాల్లో టమోటా సాగు చేశారు. అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతినడంతో దిగుబడి భారీగా తగ్గిపోయింది. ఆ సమయంలో ధరలు పెరిగాయి. ప్రస్తుతం కొన్ని రోజులుగా వాతావరణం అనుకూలంగా ఉండడంతో దిగుబడులు పెరుగుతున్నాయి.

 

 

జిల్లాలోని మార్కెట్ల ద్వారా రోజుకు 20 లారీలకుపైగా టమోటాను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాదు, సికింద్రాబాద్‌ మార్కెట్లకు తరలించి కిలో రూ.20కుపైగా విక్రయించి లాభపడుతున్నారు. పత్తికొండ మార్కెట్లో అత్యధికంగా టమోటా క్రయవిక్రయాలు సాగుతున్నాయి. ఆ మార్కెట్‌లో గతేడాది 730 టన్నుల టమోటా విక్రయాలు జరిగాయి. ప్రస్తుత ఏడాది ఇప్పటి వరకూ 320 టన్నుల టమోటా విక్రయాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. శనివారం 2.79 టన్నుల క్వింటాళ్లుఅమ్ముడయ్యాయి. రోజుకు సరాసరి మూడు టన్నుల చొప్పున సరుకు వస్తోంది. రెండు రోజుల క్రితం వరకూ కిలో టమోటాకు రెండు రూపాయల ధర లభించేది. ప్రస్తుతం అంతకంటే ధర తగ్గిపోయింది. కనీసం కూలి, రవాణా ఛార్జీలు కూడా రాకపోవడంతో కొందరు రైతులు టమోటాలను పత్తికొండ మార్కెట్‌లోనే పారబోసి వెళ్లిపోతున్నారు.ఎకరా విస్తీర్ణలో టమోటా సాగు చేశాను. రూ.50 వేల వరకూ పెట్టుబడి అయింది. 19 గంపల టమోటాను మార్కెట్‌కు తీసుకెళ్లాను. ఒక్కో గంపకు రూ.25 మాత్రమే ధర లభించింది. పెట్టుబడిమాట అటుంచి కనీసం రవాణా ఛార్జి, టమోటాను ఏరించడానికి అయిన కూలీల ఖర్చులు కూడా రాలేదు.

 

Post Midle

Tags: Travel expenses are not coming

Post Midle

Leave A Reply

Your email address will not be published.