ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి సంస్థను కాపాడండి

-జగిత్యాల డిపో మేనేజర్ జగదీశ్వర్

 

జగిత్యాల ముచ్చట్లు :

 

ఆర్ టి సి బస్సులోనే ప్రయాణించి సంస్థ పురోభివృద్ధి సహకరించాలని జగిత్యాల డిపో మేనేజర్ జగదీశ్వర్ పేర్కొన్నారు.బుధవారం జగిత్యాల మండలంలోని జాబితాపూర్ గ్రామంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రయాణీకులు, గ్రామస్తులతో ముఖాముఖి, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ జగదీశ్వర్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులు నడిచే రూట్లలో ప్రయాణికుల నుండి స్పందన లేకపోతే సరైన ఆదాయం రాకపోవడంతో ఆ రూట్లో బస్సులు రద్దు చేయడం జరుగుతుందన్నారు. అందుకు గాను ప్రతి ఒక్కరు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులను ఆర్టీసీ బస్ లోనే ప్రయాణించాలని జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ జగదీశ్వర్ సూచించారు.లాక్ డౌన్ ముగియడంతో దాదాపు అన్ని రూట్లలో బస్ లు నడుపుతున్నామని, ఇక నుండి ప్రయాణికులు ప్రైవేటు వాహనాలని ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలని కోరారు. జగిత్యాల నుండి పెగడపల్లి జాబితాపూర్ మీదుగా వెళ్ళే బస్సు సౌకర్యం మళ్ళీ పునరుద్ధరించాలని డిఎం జగదీశ్వర్ కు స్థానిక నేతలు, గ్రామస్తులు విన్నవించారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: Travel on RTC buses and save the company

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *