యాత్ర సక్సెస్ 

Travel Success
Date:11/02/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
టాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. పాతతరం నటి సావిత్ర జీవిత కథతో తీసిన ‘మహానటి’ తెలుగులో ఈ తరహా సినిమాలకు నాంది పలికింది. ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో జీవిత కథలపై నిర్మాతల కన్ను పడింది. ఈ కోవలోనే ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఘోరంగా ఫెయిలైంది. ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో మూడో వంతు కూడా రాబట్టలేక బాక్సాఫీసు వద్ద చతికిలపడింది. దీంతో రెండో భాగం ‘మహానాయకుడు’ విడుదలపై యూనిట్ తర్జనభర్జన పడుతోంది. దీని తర్వాత అందరి దృష్టి పడింది మాజీ సీఎం వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’పైనే. ఎన్నికల ఏడాది కావడంతో ‘యాత్ర’పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకోవడంతో ‘యాత్ర’ సక్సెస్ అయింది.
తొలి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకుని మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఫస్ట్ వీకెండ్(శుక్ర, శని, ఆది)లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.3.96 కోట్లు రాబట్టింది. విదేశాల్లో కలెక్షన్లు కలుపుకొని మొత్తంగా రూ.5.22కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ ముమ్ముట్టీ నటించారనడం కంటే జీవించారనే చెప్పొచ్చు. ఆయన ఆహార్యం, మాటతీరు అచ్చం రాజన్నలాగే ఉందంటూ వైఎస్ అభిమానులు సంబరపడిపోతున్నారు. హిట్ టాక్ రావడంతో సాధారణ రోజుల్లోనూ ‘యాత్ర’ స్టడీగా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Tags: Travel Success

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *