భారీ కాన్వాయ్ తో ట్రీట్

హైదరాబాద్  ముచ్చట్లు:

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలుసుకునేందుకు ములుగు ఎమ్మెల్యే సీతక్క భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. ఆమె వెంట కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో కార్లలో బయలుదేరారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా నియమించిన విషయం తెలిసిందే. రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు.ఇదిలా ఉంటే, సమ్మక్కసారలమ్మలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క తన మొక్కు చెల్లించుకున్నారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియమితులవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆమె.. సోమవారం మేడారం వెళ్లి అమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్లిన సీతక్క… ప్రదక్షణ అనంతరం అమ్మవార్లకు మొక్కు చెల్లించారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:Treat with a huge convoy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *