సమస్యల మధ్యే చికిత్స..

Treatment among the problems ..

Treatment among the problems ..

Date:22/09/2018
కుమురం భీమ్ ముచ్చట్లు:
కుమురం భీమ్ జిల్లాలో విషజ్వరాల బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. వాతావరణ మార్పులు, దోమలు విజృంభిస్తుండడంతో పలువురు అనారోగ్యాల బారినపడుతున్నారు. గ్రామీణ-పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా పలువురు జ్వరాలతో అల్లాడిపోతున్నారు. కుమురం భీమ్‌లోనే కాక ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక ఉమ్మడి జిల్లావాసుల వైద్య అవసరాలకు పెద్ద దిక్కు రిమ్స్ సైతం జ్వరపీడితులతో నిండిపోయింది.రోజూ రిమ్స్‌ ఆసుపత్రికి వందల సంఖ్యలో రోగులు చేరుతున్నారు. వైద్యం కోసం ఓపీలో బారులు తీరుతున్నారు. రిమ్స్‌ ఆసుపత్రి పడకల సామర్థ్యం 500. అయితే ఇంతకు మించిన స్థాయిలో రోగులు ఇన్‌పేషంట్లుగా చేరి వైద్య సేవలు పొందారు.
రోజురోజుకూ ఈ సంఖ్య అధికమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రోగుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఆసుపత్రిలో అదనపు పడకలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అవి సరిపోకపోవడంలేదు. దీంతో ఒకే పడకపై ఇద్దరేసి రోగులను పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారు. కొందరికి నేలపైనే పడుకోబెట్టి చికిత్స చేస్తున్న పరిస్థితీ ఉంది. రిమ్స్‌లోని జ్వరాల వార్డులో ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కన్పిస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఒకే పడకపై ఇద్దరు వైద్యం పొందుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వారం రోజులుగా రిమ్స్‌లో ఇలాంటి పరిస్థితి సర్వసాధారణమైపోయిందని అంటున్నారు. వారం రోజులుగా రిమ్స్‌లో రోగుల సంఖ్య గణనీయంగా పెరగడంతోనే పడకలకు కొరత ఏర్పడిందని ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి. పడకల సామర్థ్యానికి అదనంగా రెండు వందల నుంచి మూడు వందల మంది రోగులు చేరుతున్నారని వైద్యులు సైతం స్పష్టం చేస్తున్నారు. అదనంగా పడకలు వేసినా సరిపోవటం లేదని ఇంకా ఏర్పాటు చేద్దామంటే స్థలం లేదని చెప్తున్నారు.
బాధితులందరికీ వైద్యం అందించాలన్న భావనతోనే ఒకే పడకపై ఇద్దరికి చొప్పున వైద్యంచేస్తున్నామని.. నేలపైనా పడుకోబెట్టి వైద్యసేవలు అందిస్తున్నామని వివరిస్తున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామనీ స్పష్టంచేశారు. వీలైనంత మేర మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. బాధితులందరికీ సమర్ధవంతమైన వైద్యం అందించాలన్న తపన మంచిదే.
అయితే ఒకే పడకపై తమతో పాటే మరో రోగి ఉంటుండడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోగుల సంఖ్య పెరగటంతో ఒకే పడకపై ఒకరటు, ఒకరిటుగా పడుకోబెడుతున్నారు. రోగులకు గత రెండు రోజులుగా ఇదేవిధంగా చికిత్సను అందిస్తున్నారు. దీంతో అతికష్టంపై పడుకోవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.  ఇక ఒకరి నుంచి మరొకరికి కొత్త ఇన్ఫెక్షన్లు సోకుతాయోమోనన్న భయం వారిని వెన్నాడుతోంది.
అందుకే ఆసుపత్రిలో వీలైనంత త్వరగా పడకల సంఖ్య పెంచాలని అంతా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలాఉంటే పెరిగిపోతున్న రోగులకు సంఖ్యకు తగ్గట్లుగా ఇతరత్రా ఏర్పాట్లు లేవని వార్తలొస్తున్నాయి. బాధితులకు సెలైన్‌ ఎక్కించటానికి రిమ్స్‌లో సరిపడా స్టాండ్ల కరవైనట్లు పలువురు వాపోతున్నారు. పడకకు అడ్డుగా పెట్టే తెర స్టాండుకే సెలైన్‌ సీసాను వేలాడదీసి ఎక్కిస్తున్నారని చెప్తున్నారు.
ఇప్పటికైనా ఈ సమస్యలపై ఆసుపత్రి వర్గాలు స్పందించి పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. రోగులందరికీ సమర్ధవంతైన వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags:Treatment among the problems ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *