Tribal leaders sell rice, dal and salt in the colony

గిరిజన నాయకులు కాలనీలో బియ్యం, పప్పు, ఉప్పు వితరణ

-గిరిజన నాయకులు పులి శ్రీనివాసులు, జానం గంగిరెడ్డి

Date:04/05/2020

కే.వీ పల్లె ముచ్చట్లు:

ఏ.పీ.జీ.వై.ఎస్.ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, పులి శ్రీనివాసులు, జిల్లా గౌరవాద్యక్షుడు జానం గంగిరెడ్డి తమ స్వంత ఖర్చులతో మండలంలోని గోరంట్లపల్లె, కమ్మిరెడ్డి గారి పల్లె, ఎస్.టీ కాలనీ వాసులకు నిత్యావసర సరుకులైన బియ్యం, పప్పు, ఉప్పు, టమోటా, ఎర్రగడ్డలు మరియు అరటిపళ్ళు వితరణ కార్యక్రమం తహసీల్దారు బలరాం చేతుల మీదుగా జరిగినది.ఈ సందర్భముగా తహసీల్దారు బలరాం మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్న నేపద్యములో తమ సంఘం తరుపున గిరిజన యానాదులను ఈ విదంగా ఆదుకుంటున్నందుకు సంఘ నాయకులను అభినందించాడు.సంఘ నాయకులు పులి శ్రీనివాసులు, జానం గంగిరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికి కొన్ని ఎస్.టీ కాలనీలలో లాక్ డౌన్ సందర్బంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని, ఇంకా చేయబోతున్నామని ఈ రోజు తమ స్వంత కాలనీలో వితరణ చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు.పై కార్యక్రమములో గిరిజన నాయకులు గానుగు పెంట సిద్దు, పులి మల్లీశ్వరి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో చిత్తూరు టౌన్, పుత్తూరు, శ్రీకాళహస్తి కంటైన్మెంట్ జోన్లు

Tags: Tribal leaders sell rice, dal and salt in the colony

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *