గిరిజనుల నిరసన

అల్లూరి ముచ్చట్లు:


ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పించాలని కోరుతూ వినూత్న రీతిలో నిరసన ప్రదర్శ నలు వెల్లువెత్తుతున్నాయి.అభివృద్ధికి సూచికగా ఉండే రోడ్డు సదుపాయాలు లేకపోవడంతో ఏజెన్సీ ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. కొన్నేళ్లుగా వేధిస్తున్న రోడ్డు సమస్యలను పరిశీలించాలని కోరుతూ ప్రజలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.ప్రధానంగా చిన్నారులకు అంగన్వాడి సెంటర్,స్కూలు సౌకర్యం కల్పించాలని కోరుతూ అడ్డాకు టోపీ ధరించి అర్ధనగ్నం గా డోలిలతో ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు.ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరిం చుకుంటూ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిపుత్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

 

 

ప్రధానంగా అటవీ హక్కుల చట్టాన్ని సవరణ చేసి కార్పొరేట్ సంస్థలకు చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వ చర్యను ఖండించారు.అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి జిల్లా సరిహద్దు గ్రామాలైన అర్ల పంచాయతీ రోలుగుంట మండలం పెద్ద గురువు పిత్రు గేడ్డ నుండి మూలపేట పంచాయితీ జాజుల బంధ గ్రామం వరకు 4 కిలోమీటర్ దూరం అడ్డాకుల ధరించి డోలి తో అర్థ నగ్న ప్రదర్శనతో జాజుల బంధ గ్రామంలో వినూత్నంగా ధర్నా నిర్వహించారు.గ్రామానికి కనీసం నడవడానికి రోడ్డు లేకపోవడంతో మంచి నీటి సౌకర్యం లేకపోవడం తో జ్వరం వచ్చినా గర్భిణీ స్త్రీలు డోలీలు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

 

Tags: Tribal protest

Leave A Reply

Your email address will not be published.