విదేశాల్లో చదివే గిరిజన విద్యార్థులకు రూ. 20 లక్షల సాయం

Date:15/02/2018
వికారాబాద్ ముచ్చట్లు:
విదేశాల్లో చదివే గిరిజన విద్యార్థులకు రూ. 20 లక్షల సాయం అందిస్తున్నట్లు మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని తాండూరులో సేవాలాల్ మహారాజ్ 279 జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో కలెక్టర్ జలీల్ పాల్గొన్నారు. అనంతరం సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి… గిరిపుత్రుల ఆరాధ్య దైవం స్ఫూర్తితో గిరిజనులు చైతన్యంఅభివృద్ధి సాధించాలన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. 500 జనాభా గల ప్రతి గిరిజన తండాను ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేస్తామన్నారు. తాండూరులో సకల సౌకర్యాలతో అధునాతన బంజారా భవన్ నిర్మాణాలను చేపట్టనున్నట్లు మంత్రి ప్రకటించారు.
Tags: Tribal students study abroad of Rs. 20 lakh assistance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *