అభ్యుదయ పథంలో గిరిజన వార్డు

Tribal ward in progressive path

Tribal ward in progressive path

– ఎంటెక్‌ మనోహర్‌ హవ్వ

Date:30/12/2018

పుంగనూరుముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో అత్యధిక జనాభా కలిగి, అతిపెద్ద వార్డుగా ఉన్న ఇరవై మూడవ వార్డు ఎస్టీలకు కేటాయించారు. ఇక్కడ మేధావివర్గం నివాసం ఉన్నారు. ఈ వార్డు కౌన్సిలర్‌గా ఎంటెక్‌ కంప్యూటర్స్ చదివిన మర్రిమాకులపల్లె మనోహర్‌ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైయ్యారు. మండలంలోని కుమ్మరగుంట గ్రామంలో రైతు కుటుంభానికి చెందిన మనోహర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో ఇంజనీరింగ్‌ చదువును పక్కన పెట్టి పుంగనూరు మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికైయ్యారు. వార్డులోని ప్రజలకు అన్ని రకాలుగా అండ గా ఉంటు వందశాతం అభివృద్ధి పనులు చేపట్టారు. అలాగే వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటు తనదైన ముద్ర వేసుకున్నారు.

వార్డు వివరాలు…

పట్టణంలోని ఇరవై మూడవ వార్డులో జనాభా 5,154 మంది కాగా ఓటర్లు 2,856 మంది ఉన్నారు. ఇక్కడ విశ్రాంత ఉద్యోగులు, మేదావివర్గం , రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ వార్డులో ఎన్నిక కావడం గఘనం. పోటాపోటీల మధ్య వార్డు కౌన్సిలరు పదవికి వైఎస్‌ఆర్‌సీపీ తరపున పోటీ చేసిన మనోహర్‌ కౌన్సిలర్‌గా ఎన్నికైయ్యారు. ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో వార్డులో సేవ, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం చేపట్టి, వందశాతం పనులు పూర్తి చేశారు. ఉదయం నుంచి సాయంత్రం దాక కౌన్సిలర్‌ ప్రజలతో మమెకమై, వారి భాగోగులను దగ్గరుండి పర్యవేక్షిస్తూ, పట్టణ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. వార్డులో 326 ఎల్‌ఈడి దీపాలు ఏర్పాటు చేసి, ప్రతి ఇంటికి రోజు మంచినీటిని సరఫరా చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలకు అగ్రస్థానం కల్పించారు. తడిచెత్త, పొడిచెత్త వేరుచేయడం, బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధించడంతో పాటు ప్లాస్టిక్‌ కవర్ల నిషేధాన్ని ఈ వార్డులో పకడ్భంధిగా అమలు చేశారు. వార్డులోని అన్ని ప్రాంతాలలో మూడువేల వెహోక్కలను నాటి , ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. ఉత్తమ కౌన్సిలర్‌గా 2016 లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కౌన్సిలర్‌ను అభినందించి అవార్డు అందజేశారు. అలాగే 2017లో స్వచ్చభారత్‌లో రెండవ స్థానం అవార్డు లభించగా కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో అవార్డును అందజేశారు.

వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , మాజీ ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డిల సూచనల మేరకు చైర్‌పర్శన్‌ షమీమ్‌షరీఫ్‌, వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, కమిషనర్‌ కెఎల్‌.వర్మ సహకారంతో ఈ వార్డును వందశాతం అభివృద్ధి చేశామని , అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి, వార్డు ప్రజలకు మనోహర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

అభివృద్ధి కార్యక్రమాలు….

వార్డులోని కొత్తయిండ్లు, సాయినగర్‌, ఎల్‌ఐసీ కాలనీ, దండుపాళ్యెంరోడ్డు, సూర్యనగర్‌, బిలాల్‌మసీదువీధి, కొత్తపేట సర్కిల్‌, ట్రావెలర్స్బంగ్లావీధి, ఎస్సీ బాలికల హస్టల్‌వీధి, ఎంకెబి వీధి, కమల్‌వీధి, లీడ్‌క్యాప్‌వీధి, ఆవులవారివీధి, ఎన్‌జివో కాలనీ, ఎంబిటి రోడ్డు, ప్రాంతాలలో పైపులైన్లు, మురుగునీటి కాలువలు, వీధులు ఏర్పాటు చేసి, వందశాతం అభివృద్ధి చెందిన వార్డుగా నిలుపుకున్నారు. విస్తరణ ప్రాంతాలైన లీడ్‌క్యాప్‌వీధి, సూర్యనగర్‌రోడ్డు, కమల్‌వీధి రూ.50 లక్షలతో పనులు చేపట్టారు. వార్డులో గత నాలుగు సంవత్సరాలలో రోడ్లు, కాలువలకు మాత్రం కోటిరూపాయలు ఖర్చు చేశారు. అలాగే నీటి సమస్య తీర్చేందుకు పది బోర్లు వేసి సుమారు రూ.60 లక్షలతో బోర్లు, మోటార్లు అమర్చి, నీటి సమస్య లేకుండ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని మోడల్‌ అంగన్‌వాడీగా మార్చడం , మాజీ ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి నిధులతో ఆర్‌వోఆర్‌ప్లాంటును ఏర్పాటు చేసి, శుద్దమంచినీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే చిప్‌ పథకం ద్వారా కోటిరూపాయలతో రోడ్లు, కాలువలకు, పైపులైన్లకు టెండర్లు పిలిచారు.

పెన్షన్లు, రుణాలు…

వార్డులోని పేద మహిళలకు , వృద్ధులకు , ప్రత్యేక ప్రతిభావంతులకు కలసి అన్ని రకాల పెన్షన్లు కలిపి 120 మందికి రూ.1.26 లక్షలు ప్రతి నెల పంపిణీ చేస్తున్నారు.్య వార్డులోని 60 గ్రూపుల్లోని 600 మంది మహిళలకు బ్యాంకుల ద్వారా లింకేజి రుణాలు , సబ్సిడిలు సుమారు రూ. 2 కోట్లు పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా నిలబడ్డారు. వార్డులో అన్నిట ఆదర్శంగా నిలిచి, ప్రజలతో మమెకమైయ్యారు.

 

అభివృద్ధి జరుగుతుందనుకోలేదు …

మా వార్డులో ఇంత అభివృద్ధి జరుగుతుందని అనుకోలేదు. గతంలో ఉన్న కౌన్సిలర్లు వార్డు అభివృద్ధిని పట్టించుకోలేదు. మనోహర్‌ కౌన్సిలర్‌గా ఎన్నికై, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆహర్నిశలు ప్రజల సేవలో గడుపుతున్న కౌన్సిలర్‌ మాలో ఒకరుగా ఉన్నారు. ఈసారి మా ఓట్లు ఆయనకే వేస్తాం .

– లక్ష్మమ్మ, గృహిణి, పుంగనూరు

మాకు సమస్యలు లేవు….

మావార్డులో సమస్యలు లేవు. అన్నిప్రాంతాలలోను ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృషితో మా కౌన్సిలర్‌ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా నీటి సమస్య తీర్చారు. ఎల్‌ఈడి దీపాలు వేశారు. కుక్కలబెడద లేకుండ చేశారు. ఇంతటి అభివృద్ధి చేసిన వైఎస్‌ఆర్‌సీపీకి మేము అండగా ఉండి గెలిపిస్తాం.

– కె.సుభాషిని, గృహిణి, పుంగనూరు

 

డిసెంబర్ 30న’రన్ ఫర్ ఎంప్లాయ్మెంట్’ టోర్నమెంట్

Tags:Tribal ward in progressive path

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *