వ్యవసాయ పండుగకు సిద్ధమౌతున్న ఆదివాసీలు

అదిలాబాద్ ముచ్చట్లు:

ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ప్రతీది సాంప్రదాయ బద్దంగానే చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఆదివాసీ గోండు గూడెంలలో ప్రతి ఏటా పుడమి తల్లిలో విత్తనాలు వేసే ముందు సంస్కృతి సంప్రదాయాలతో విజంగ్ మొహు తుర్  మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు.. మృగశిర కార్తె ప్రారంభానికి మూడు రోజుల ముందు ప్రారంభమై.. తర్వాత మూడు రోజులు.. అంటే వారం రోజుల్లో అన్ని ఆదివాసీ గూడెంలలో పూర్తి చేస్తారు. ప్రతి ఏటా తొలికరి జల్లులతో గోండు గూడెంలలో విత్తనాల పండుగ వాతావరణం మొదలవుతుంది..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ, గోండు గూడెంలలో గత మూడు రోజుల నుంచి విత్తనాల పండుగ (విజంగ్ మోహుతుర్) ప్రారంభమైంది. మృగశిర కార్తె ప్రారంభానికి మూడు రోజుల ముందు ప్రారంభమై.. మృగశిర కార్తె తర్వాత మూడు రోజుల్లో.. అంటే వారం రోజుల్లో అన్ని గూడెంలలో పండగ పూర్తవుతుంది.. ఏటా వర్షాకాలం ప్రారంభంలో తొలి చినుకుల జల్లులతో ఆదివాసీ గోండు గూడెంలలో విత్తనాల పండుగ మొదలవుతుంది. ప్రతి గూడెంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తుండగా.. ముందుగా గ్రామ పటేల్ ఇంటి గుమ్మంలో గ్రామస్తులంతా కలిసి సమావేశమవుతారు. మిగిలి ఉన్న శుభాకార్యాలు, ఇతర కార్యక్రమాలపై గ్రామ ప్రజల అభిప్రాయాలు తీసుకుంటారు. విజంగ్ మోహుతుర్ పండుగల తేదీలను నిర్ణయిస్తారు.మొదటి రోజున గ్రామా శివారులో చుట్టూ ఉన్న దేవతలకు (శివర్ బోవర్) నవ ధాన్యాలను ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయంతో చిన్నా పెద్దా బేధం లేకుండా పూజలు చేస్తారు.

 

 

 

రెండో రోజున గ్రామ ముఖ్యమైన దేవుడు అకిపెన్ (అకిపెన్ అంటే గ్రామం ఏర్పాటయ్యేటప్పుడు.. మొదటి సారిగా గ్రామాన్ని ఇదే ప్రాంతంలో ఏర్పాటు చేద్దామని నిర్ణయం తీసుకున్న తర్వాత.. సూర్య చంద్ర ఆకారంతో జెండా పెట్టి.. దీపాన్ని వెలిగించిన స్థలం) అకిపెన్ లో నవధాన్యాలతో పూజా కార్యక్రమం చేసి గ్రామస్తులంతా రాత్రిపూట భోజనాలు చేస్తారు. మూడోరోజు తెల్లావారు జామున నుంచి ప్రతి వ్యవసాయ కుటుంబ సభ్యులు విజంగ్ మొహుతుర్ (విత్తనాల పండుగ)కు సంబంధించిన నవధాన్యాలు కొత్త బొంగు కర్రపుల్లలతో తయారు చేసిన గంప (అంచె)లో పూజ సామాను తీసుకెళ్తారు. జొన్నగట్కా, దంచిన ఎర్రకారం, ఎల్లిపాయ, మోదుగాకులు, కుంకుమ, గులాల్, కొబ్బరికాయ, అగర్ బత్తి, ధూప్ వంటి సామానులను ఇంటి యజమానురాలు గంప ఎత్తుకుని.. ఇంటి యజమానితో వెళ్తారు. గొడ్డలి, కొడవలి పెద్ద ములుగు కట్టెతో కుడి భుజంపై పెట్టుకొని పూజకు కుటుంబ సభ్యులంతా కలిసి ఒకే వరుసలో బయలు దేరుతారు. వ్యవసాయ చేను మధ్యలో ఉన్న మోహుతుర్ దేవతకు నవధాన్యాల పూజా చేస్తారు.

 

 

 

Post Midle

అనంతరం అక్కడ జొన్న గట్కా, ఎండిన కారంతో మోదుగ ఆకులపైన భోజనం చేస్తారు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మల్లి గ్రామంలోని జంగుబాయి దేవత, భీమాల్ పెన్, రాజుల్క్, బేతల్, పొద్ధి అవ్వల్, స్వర్గస్తులైన కుటుంబ సభ్యులను కూడా తలుచుకుని పూజలు చేస్తారు.హోళీ పండగ రోజునే గ్రామంలో వరుసకు బావ -బావమరిది అయ్యే ఇద్దరిని (మాతారి -మాతరల్) ముసలోడు ముసల్దిగా నామకరణం చేస్తారు. విత్తనాల పండుగ సందర్బంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి గ్రామస్తులతో కలిసి భోజనాలు చేస్తారు. తర్వాత మగవాళ్ళంతా కలిసి బుర్ర తుపో (బండలు పెట్టి – బట్టతో తయారు చేసిన బంతి ఆట) ఆటను సాయంత్రం వరకు ఆడుతారు. గ్రామంలోని మహిళలు కూడా గ్రామ పటేల్ ఇంటి ఆవరణలో సమావేశమై గ్రామానికి సంబంధించిన మంచి చెడు విషయాలు మాట్లాడుకుంటారు. సంస్కృతి పరంగా వచ్చిన పాటలు పాడుతారు. వాళ్లు కూడా వివిధ ఆటలు ఆడుతారు. సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని.. నవధాన్యాలు, పచ్చని పంటలతో గ్రామం కళకళలాడాలని కోరుతూ గ్రామస్తులంతా విత్తనాల పండుగ సంబరాల్లో పాల్గొని వ్యవసాయ పనులకు అంకితమవుతారు. నేటి నుండి గడ్డాలు, మీసాలు, కటింగ్ తీయకుండా.. సంప్రదాయాలను భంగం కలగకుండా.. విత్తనాల పనులు పూర్తయిన తర్వాత ఆకాడి పండుగ వరకు నియమ నిబంధనలతో ఆదివాసులు తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

 

Tags:Tribals preparing for an agricultural festival

Post Midle
Natyam ad