పిడుగుపాటుకు గిరిజనుడు, 50 పశువులు మృతి
మన్యం ముచ్చట్లు:
పెదబయలు మండలంలోని ఇంజరి పంచాయతీ పరిధి జమాదంగి గ్రామ అటవీ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షాల కారణంగా భారీ పిడుగు పడింది. గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు పిడుగు పాటుకు జమాదంగి గ్రామానికి చెందిన 50 పశువులు 20 మేకలు మృత్యువాత పడ్డాయన్నారు.పశువుల కాపరి సన్నీ తీవ్ర గాయాలతో బాధపడుతూ.. మృతి చెందాడు.ఒకేసారి గిరిజన కుటుంబాల్లో ఇంత భారీ నష్టం జరగడంతో గిరిజనులు కన్నీరుమున్నీరు అవుతూ..ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని ఆవేదన చెందుతున్నారు.
Tags; Tribesman, 50 cattle killed by lightning