ఆన్ లైన్ సేవలు పునరుద్ధరించాలి

Date:24/09/2020

జగిత్యాల ముచ్చట్లు

మెట్ పల్లి పోస్టాఫీస్ లో నెలకొన్న ఆన్ లైన్ సమస్యను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించి సేవలను పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ మెట్ పెల్లి పట్టణాధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబొద్దిన్ పాషా డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత పక్షం రోజులుగా పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్ లో ఆన్ లైన్ సేవలు పనిచేయకపోవడంతో పట్టణ ప్రజలు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నెలకొన్న సమస్యను పరిష్కరించడంలో సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. నిత్యం వందల సంఖ్యలో పలు సేవల నిమిత్తం పోస్టాఫీస్ కు వచ్చే వారికి ఆన్ లైన్ సేవలు తాత్కాలికంగా అందడం లేదన్నారు. వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు ఆన్ లైన్ సేవలను వెంటనే పునరుద్ధరించి, ఇబ్బందులు తొలగించాలన్నారు.

 

ఎమ్మెల్యేను అడ్డుకున్న గిరిజనులు

Tags:Tribesmen who blocked the MLA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *