ఎమ్మెల్యేను అడ్డుకున్న గిరిజనులు

Date:24/09/2020

విజయనగరం  ముచ్చట్లు

విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొరకు నిరసన సెగ తగిలింది. చీపురువలసలో ఎమ్మెల్యే రాజన్నదొరకు చుక్కెదురయింది. గెలిచిన తరువాత గ్రామాలను మరచిపోతున్నారని గిరిజనులు అయన కారును అడ్డుకున్నారు. కనిపించినపుడు సమస్యలు చెబితే మరో సారి రానని ఎమ్మెల్యే బదులిచ్చారు. ఎమ్మెల్యే వెళ్లిన త్రోవలో నిరసనగా గిరిజన యువకులు మంటలు వేసారు. సంబర హాస్పిటల్ శంకుస్థాపనకు వెళ్తున్న ఎమ్మెల్యే పీడీక రాజన్న దొరకు ఈ అనుభవం ఎదురయింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లు అధికార అధికారపార్టీలో ఉన్నప్పటికీ సంవత్సరాలు గడుస్తున్న మా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని గిరిజనులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసారు.

 

కొడాలి నానిని తొలగించాలి

Tags:Tribesmen who blocked the MLA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *