Natyam ad

బదిలీ పై వెళుతున్న ఎస్సై కి ఘనంగా ఆదివాసీల వీడ్కోలు

-గిరిజన సంప్రదాయలతో తిర్యాని ఎస్సై రామారావుకు వీడ్కోలు పలికిన అడవి బిడ్డలు
-ఉద్యోగులకు సేవతోనే గుర్తింపు
-అసిఫాబాద్  జిల్లా ఎస్పి (అడ్మిన్) వైవి సుధీంద్ర
 
ఆసిఫాబాద్ ముచ్చట్లు:
 
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో  తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నఎస్సై రామారావు అసిఫాబాద్ జిల్లా తిర్యాని ఖమ్మం కమిషనరేట్ పరిధిలోకి బదిలీ పై వెళుతున్న సందర్భంగా స్థానిక ఆదివాసులు తమ సంప్రదాయ పద్దతిలో ఘనంగా వీడ్కోలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా  కొమురం భీం జిల్లా ఎస్పీ (అడ్మిన్) వైవి సుధీంద్ర మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగులు చేసిన సేవలతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు.. శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు మండలంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల చేపట్టారని ఆయన మండలంలో చేసిన  సేవలు ఎనలేనివి అన్నారు. అనంతరం పలువురు మాట్లాడుతూ తిర్యాణి మండలంలో గత రెండున్నర సంవత్సరాలుగా ఎస్సై గా పనిచేసిన రామారావు తమలో ఒకరిగా కలిసిపోయి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టడన్నారు. శాంతిభద్రతలు సామాజిక కార్యక్రమాలు తన రెండు కళ్ళు గా చేసుకొని పని చేశారని,ఆయన చేసిన సేవలు మండలంలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ప్రతి గడపను తట్టి నిత్యావసర సరుకులు పంపిణీ చేశాడని, అలాగే పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో మహిళలకు కుట్టు మిషన్డ్లు,వికలాంగులకు కృత్రిమ కాళ్ళు,వృద్దులకు దుప్పట్లు,గిరిజనులకు నిత్యావసర సరుకులు,గ్రామాలకు రోడ్లు,ఉచిత వైద్య శిబిరాలు,విద్యార్థులకు క్రీడా సామాగ్రి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. రామారావు తిర్యాణి మండలంలో ఫ్రెండ్లీ పోలీస్ కు నిర్వచనంగా మారాడని కొనియాడారు. అనంతరం బదిలీపై వెళ్తున్న ఎస్సై రామారావు మాట్లాడుతూ ఉన్నతాధికారుల, ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో తనకు సాధ్యమైనంత మేరకు ప్రజలకు సేవా చేయడం జరిగిందన్నారు….మారుమూల ఆదివాసీ మండలంలో  పని చేసే అవకాశం రావడం తన అదృష్టం అన్నారు. కాగా ఆదివాసీలు తమ సంస్కృతి సంస్కృతి సాంప్రదాయబద్ధంగా డోలు వాయిద్యాలతో నృత్యం చేస్తూ ఎస్సై రామారావుకు ఘనంగా వీడ్కోలు పలికారు ..ఎస్సై రామారావును మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ఆదివాసీ సంఘాల నాయకులు, ఘనంగా సన్మానించారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Tribute farewell to the essay going on transfer