కరోనా వారియర్స్ సభ్యులకు సన్మానం

Date:22/11/2020

పుంగనూరు ముచ్చట్లు:

జిల్లాలో కరోనా వ్యాధి సోకి మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించిన పట్టణానికి చెందిన కరోనా వారియర్స్కు  ఆదివారం ఘన సన్మానం చేశారు. పట్టణంలోని ఎస్‌డిపీఐ రాష్ట్ర కార్యదర్శి జహుర్‌బాషా ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాణాలకు తెగించి, కరోనా మృతుల అంత్యక్రియలు నిర్వహించిన వారియర్స్కు శాలువలు కప్పి సన్మానం చేశారు. ఈ సన్మాన కార్యక్రమాలకు వైఎస్‌ఆర్‌సీపీ మైనార్టీ సెల్‌ కార్యదర్శి అర్షద్‌అలి, న్యాయవాదులు షమివుల్లా, హేమంత్‌కుమార్‌, శ్రీనివాసులు హాజరై సన్మానం చేశారు. అలాగే మైనార్టీ నాయకులు ఇబ్రహిం , కరోనా వారియర్స్కు స్ప్రేయర్లు. డ్రైప్రూడ్స్ అందజేశారు. ఈ సందర్భంగా జహుర్‌బాషా మాట్లాడుతూ జిల్లాలో ఎవరు చేయలేని సహసాన్ని పట్టణానికి చెందిన ఎస్‌డీపీఐ, పాపులర్‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన యువకులు చేశారని కొనియాడారు. ఇప్పటి వరకు 51 మంది అంత్యక్రియలు నిర్వహించారన్నారు. ఇలాంటి వారిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుని, ఆపదలో ఉన్నవారికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో పీఎఫ్‌డిఐ అధ్యక్షుడు చాంద్‌బాషా, సెక్రటరీ అన్వర్‌బాషా, ఖాదీర్‌ తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

Tags: Tribute to members of the Corona Warriors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *