Natyam ad

పద్మశ్రీ చంద్రశేఖర్ కు సత్కారం

కాకినాడ ముచ్చట్లు:

లక్షలాది మందికి ఉచితంగా నేత్ర చికిత్సలు అందించి వారిలో వెలుగులు నింపిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సంకురాత్రి చంద్రశేఖర్ ను అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కిరణ్ కంటి ఆస్పత్రిలో జరిగిన సత్కార కార్యక్రమాన్ని  ఉద్దేశించి ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ  మాట్లాడుతూ  30 ఏళ్లుగా ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు రావడం గర్వకారణం అన్నారు. అదేవిధంగా శారదా విద్యాలయం ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దుతున్నారని డాక్టర్   అడ్డాల తెలిపారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ పద్మశ్రీ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్ ,ఎస్. శ్రీ నగేష్, డాక్టర్ శిరీష, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, చింతపల్లి సుబ్బారావు, అడబాల సత్యనారాయణ, బుద్ధ రాజు సత్యనారాయణ రాజు ,ఓం నమశ్శివాయ, రేలంగి బాపిరాజు, పి. పార్థసారథి, రాఘవరావు, రాజా తదితరులు పాల్గొన్నారు.

 

 

Tags; Tribute to Padma Shri Chandrasekhar

Post Midle
Post Midle