Natyam ad

మంథనిలో పిట్టల రాజేందర్ కు కొవ్వొత్తులతో ఘన నివాళులు    

మంథని ముచ్చట్లు:


సీనియర్ జర్నలిస్టు, టీయుడబ్ల్యూజే. ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిట్టల రాజేందర్ ఆకస్మికంగా మృతి చెందడం పట్ల మంథని ప్రెస్ క్లబ్ ఘనంగా నివాళులర్పించింది.  టిడబ్ల్యూజే జిల్లా శాఖ ఇచ్చిన పిలుపుమేరకు మంథని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి  మంథని ప్రెస్ క్లబ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు జర్నలిస్టులు ర్యాలీగా వచ్చి పట్టణంలోని  అంబేడ్కర్ విగ్రహం వద్ద  కొవ్వొత్తులతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన పత్రిక విలువలను కాపాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కొరకు  చేసిన విశేష కృషిని,  సేవలను కొనియాడుతూ రాజేందర్ అన్న అమరహే అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అంకరి కుమార్ ఆర్ల బాపు, టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు పోతరాజు సమ్మయ్య, జిల్లా సహాయ కార్యదర్శి కొమురోజు చంద్రమోహన్, జిల్లా కోశాధికారి పెండ్యాల రామ్ కుమార్, సీనియర్ జర్నలిస్టులు కొమురోజు మారుతి, మోత్కూరి శ్రీనివాస్, కంది కృష్ణారెడ్డి, రావుల తిరుమల్, మహమూద్ ఖాన్, గంధం ఆంజనేయులు, బసాని సాగర్, మంథని మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, కౌన్సిలర్లు వీకే రవి, కాయితి సమ్మయ్య లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Tribute to Pittala Rajender in Manthani with candles

Post Midle
Post Midle