పుంగనూరులో కవి సాల్వరాజు సతీష్ కుమార్ కు సన్మానం

పుంగనూరు ముచ్చట్లు:
 
చిత్తూరు జిల్లా పుంగనూరు కొత్తఇండ్లు కు చెందిన కవి సాల్వరాజు సతీష్ కుమార్ (చిరుకవితల విహారి)కు కవనోద్ధండ పురస్కారం లభించింది.సతీష్ కుమార్ వ్రాసిన కవితల కు ఉస్మానియా తెలుగు రచయిత సంఘం ప్రధమ వార్షికోత్సవ సందర్భంగా “కవనోద్ధండ” పురస్కారంను ప్రదానం చేశారు.తన సేవలను గుర్తించి పురస్కారం అందించిన ఉస్మానియా తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా అతని మిత్రులు దుశ్యాలవల తో సత్కరించి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపి సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ కుమార్ రాజు , వైఎస్సార్ క్రాంతి పథం సీసీ గంగాధర్,నారాయణ రాజు, నవీన్,మంజునాధ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
\పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Tribute to poet Salvaraju Satish Kumar in Punganur