పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

Date:15/01/2021

అనంతపురం  ముచ్చట్లు:

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, జేసీ ప్రభాకర్ రెడ్డి సేవా స్నూర్తిని చాటుకున్నారు.కరోనా కల్లోల సమయంలో కరోనా నివారణకై తీవ్రంగా శ్రమించిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు స్పర్శ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సన్మానం చేసి సంక్రాంతి కానుకను అందించారు.కరోనా వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో మున్సిపల్ సిబ్బంది కృషి చేసిన తీరు అద్భుతం అని మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి  కొనియాడారు.వారందరికీ తాడిపత్రి ప్రజల తరపున కృతజ్ఞతా పూర్వకంగా సన్మానం చేయడం జరిగిందని,దాదాపు 300 పైచిలుకు కార్మికులు, మున్సిపల్ సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఇదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి కూడా సన్మానిస్తున్నట్టు ఆయన పేర్కోన్నారు.

సదుంలో శ్రీ అయ్యప్పస్వామికి అభరణాలు సమర్పిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి , ఎంపీ మిధున్‌రెడ్డి

Tags:Tribute to sanitation workers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *