వాజ్ పేయికి ఘన నివాళి

న్యూఢిల్లీ  ముచ్చట్లు:


భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి 4వ వర్థంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమహానీయునికి నివాళులర్పించారు. దేశ రాజధాని ఢిల్లీలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారక చిహ్నం ‘సదైవ అటల్’ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమహానీయునికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సహా బీజేపీ సీనియర్ నేతలు ‘సదైవ అటల్’ స్మారక చిహ్నం వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా 3 సార్లు ప్రధానమంత్రిగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రముఖులు గుర్తుచేసుకున్నారు.మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి దత్తపుత్రిక నమితా కౌల్ భట్టాచార్య ‘సదైవ అటల్’ స్మారకానికి చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అటల్ జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతీయ జనతా పార్టీ పితామహుడు అటల్ బిహారీ వాజ్ పేయి కోట్లాది మంది కార్యకర్తలకు మార్గదర్శి అని, ఆయన ఎందరో నాయకులకు స్ఫూర్తిదాయకమైని బీజేపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి దేశానికి మూడుసార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. 2015లో ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ లభించింది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 2018 ఆగష్టు 16వ తేదీన తుదిశ్వాస విడిచారు.

 

Tags: Tribute to Vajpayee

Leave A Reply

Your email address will not be published.