పుంగనూరులో వలంటీర్లకు సన్మానం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని సచివాలయాలలో పని చేస్తున్న వలంటీర్లను మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా సన్మానించి పురస్కారాలు అందజేశారు. మంగళవారం పట్టణంలోని 16వ సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో వలంటీర్లు రేష్మా, ప్రశాంత్, యుగంధర్, మోహన్, ఫృద్వీ, రీతేష్, సుమలత, షబ్రిన్‌తాజ్ లకు అవార్డులు అందజేసి, శాలువ కప్పి సన్మానించారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు వారి ఇండ్ల వద్దనే పరిష్కరించడం జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నాగేంద్ర, కౌన్సిలర్ మమతరాణి, వైఎస్సార్‌సీపీ నాయకుడు లక్ష్మణరాజు పాల్గొన్నారు.

Tags: Tribute to volunteers in Punganur
