పుంగనూరులో బాబాసాహేబ్ అంబేద్కర్‌కు ఘననివాళులు
పుంగనూరు ముచ్చట్లు:
భారతరాజ్యాంగ కమిటి చైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు పట్టణంలో మంగళవారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. మున్సిపాలిటిలో చైర్మన్ అలీమ్‌బాషా, కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి, కౌన్సిలర్లు అమ్ము, నరసింహులు నివాళులర్పించారు. అలాగే అంబేద్కర్ విగ్రహానికి మాలమహానాడు అధ్యక్షుడు అశోక్ , ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు నరసింహులు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వృద్దాశ్రమంలో ఎస్టీ సంఘ నాయకులు డాక్టర్ బాణావత్ మునీంద్రనాయక్, డాక్టర్ వసంతమూర్తి కలసి అంబేద్కర్‌కు నివాళులర్పించి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు నాగేనాయక్, శ్రీనివాసులు, నాగరాజ తదితరులు పాల్గొన్నారు.

Tags; Tributes to Babasaheb Ambedkar in Punganur
