పుంగనూరులో బాబాసాహెబ్‌కు ఘన నివాళులు
పుంగనూరు ముచ్చట్లు:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.సాహెబ్ అంబేద్కర్‌కు ఘననివాళులర్పించారు. శుక్రవారం ఆయన జయంతి వేడుకలు వాడవాడల నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప నివాళులర్పించి అంబేద్కర్ సేవలను కొనియాడారు. అలాగే ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే దళిత నాయకులు రాజు, నరసింహులు, బానుప్రసాద్, శ్రీనివాసులు, అశోక్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. మున్సిపాలిటిలో రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, చైర్మన్ అలీమ్‌బాషా, కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము కలసి అంబేద్కర్‌కు నివాళులర్పించి , మున్సిపల్ కార్మికులను సన్మానించారు. విశ్రాంత ఉద్యోగ సంఘ నాయకులు చెంగారెడ్డి, వెంకటపతి, రామకృష్ణారెడ్డి, లీలావతమ్మ ఆధ్వర్యంలో అంబేద్కర్‌కు నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అమరనాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు నాగరాజారెడ్డి, చెంగారెడ్డి , చంద్రారెడ్డి యాదవ్, దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Tributes to Babasaheb at Punganur
