రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్‌కు ఘన నివాళులు
పుంగనూరు ముచ్చట్లు:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించారు. శనివారం సీనియర్ సివిల్‌జడ్జి వాసుదేవరావు , ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి కార్తీక్, అడిషినల్ జూనియర్ సివిల్‌జడ్జి సింధుతో కలసి బాష్యం పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించి, రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు అమలు చేయాలని సూచించారు. మండల కార్యాలయంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి అంబేద్కర్‌కు నివాళులర్పించి ఆయన సేవలు కొనియాడారు. అలాగే గూడూరుపల్లె హైస్కూల్, మున్సిపల్హైస్కూల్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమిలో డైరెక్టర్ చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సమావేశంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్, ఎంపీడీవో రాజేశ్వరి, వైఎస్సార్సీపీ నాయకులు రమణ, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Tributes to Dr. BR Ambedkar, the maker of the Constitution
