డాక్టర్ ప్రీతికి నివాళులు
పాలకొండ ముచ్చట్లు:
పార్వతిపురం మన్యం జిల్లా పాలకొండ డివిజన్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రంలో కాకతీయ మెడికల్ కాలేజీలో జరిగిన అమానవీయ బలవంతపు మరణ కారణానికి గురి అయిన గిరిజన మెడికల్ విద్యార్థిని ఆయన డాక్టర్ ప్రీతి మరణానికి కారుకులైన వారిని వెంటనే శిక్షించాలని ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫారం మన్యం జిల్లా అధ్యక్షులు బత్తిని మోహన ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీతో నివాళులర్పించారు. దళిత గిరిజన విద్యార్థులు పెద్దచదువు కి నోచుకోకూడదా? ఆడపిల్లల పట్ల కాకతీయ మెడికల్ కాలేజీలో జరుగుతున్నటువంటి ర్యాగింగ్ ఆకృత్యాలకు నిష్కారణంగా గిరిజన యువతి డాక్టర్ ప్రీతి బలైయిందని దిగ్భ్రాంతికి లోనై నివాళులర్పించారు తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లలకు రక్షణ లేదని, ప్రత్యేక చట్టాలు ఉన్న ప్రభుత్వ చర్యలు శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు ప్రీతి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు దళిత గిరిజన విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిరంకుశ ద్వారానే బయటపడిందని గతంలో రోహిత్ వేముల మరణానికి కూడా ఇటువంటి కారణాలే ఉన్నాయని గుర్తు చేశారు .
తెలుగు రాష్ట్రాల్లో దళిత గిరిజన ఆడపిల్లలకు ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ స్థానిక యాలం అంబేద్కర్ జంక్షన్ వద్ద ర్యాలీ నిర్వహించి డాక్టర్ ప్రీతి గారికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా దళిత గిరిజన ఐక్యత వర్ధిల్లాలని దళిత గిరిజనులు కలిసి హక్కుల కోసం పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫారం పాలకొండ డివిజన్ కమిటీ సభ్యులు యమ్మల సతీష్ గారు, మండల కమిటీ సభ్యులు రాయి రామకృష్ణ, వెలగాడ రాజ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు గురుబిల్లి రవికుమార్, పట్టణ కమిటీ సభ్యులు నలబారిక సురేష్, రాకోటి వెంకట్రావు, తెర్లంగి సుధాకర్, బొంతు గవరయ్య, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

Tags; Tributes to Dr. Preeti
